పిల్లలు పుట్టడం లేదెందుకు?

నేను, మావారు క్రమం తప్పకుండా శృంగారంలో పాల్గొంటున్నాం. అయినా గర్భం రావడం లేదు. ఎందుకిలా జరుగుతున్నది?- ఓ సోదరి
కుటుంబ నియంత్రణ సాధనాలు ఉపయోగించకుండా, ఎలాంటి మందులూ వాడకుండా క్రమం తప్పకుండా ఏడాదిపాటు శృంగారంలో పాల్గొన్నా పిల్లలు పుట్టక పోవడాన్ని ‘ప్రాథమిక వంధ్యత్వం’ అంటారు. శారీరక, హార్మోన్ల లోపాలు కాకుండా, వంధ్యత్వానికి దారి తీసే శృంగారపరమైన కారణాలు కొన్ని ఉంటాయి. కలయిక జరగకపోవడం ఒక కారణం. కొన్నిసార్లు ఎలాంటి శారీరక వ్యాధులు, హార్మోన్ల లోపాలు లేకపోయినా మానసిక కారణాలవల్ల కూడా పిల్లలు పుట్టకపోవచ్చు.
పురుషుల్లో శృంగార లోపాలు
అంగస్తంభన సమస్యలు (ప్రాథమిక, ద్వితీయ కారణాలు)
వీర్యస్ఖలన లోపాలు.. అంటే పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ భయం వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. బయటే స్ఖలనం కావడం మరో సమస్య.
అంగస్తంభన ఉన్నా, భార్యకు గర్భం వస్తుందన్న భయం లేదా భార్యపై అయిష్టం వల్ల కూడా వీర్య స్ఖలనం కాకపోవచ్చు.
స్ఖలించిన వీర్యం బయటికి రాకుండా, మూత్రాశయంలోకి వెళ్లిపోవడం. వీటితో పాటు వీర్య స్ఖలనం అనేకసార్లు కావడం వల్ల వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. ఇవన్నీ పురుషుల్లో వంధ్యత్వానికి
దారితీసేవే!
స్త్రీలలో వంధ్యత్వ సమస్యలు
శృంగారం అంటే భయం, భర్త పట్ల అయిష్టతతో వ్జైనా కండరాలు బిగుసుకుపోయి కలయిక దుర్లభం అవుతుంది. ఇది పురుషాధిక్య అహంకార ధోరణులకు భార్య తిరస్కారంగా భావించవచ్చు.
సంయోగంలో నొప్పి కలుగుతుందన్న భయం; అవాంఛిత గర్భ అనుమానం; చదువు, కెరీర్ నాశనం అవుతాయేమో అన్న భయం; పుట్టింటి బంధాలకు దూరం కావాల్సి రావడం; పెండ్లి తర్వాత ఆకాంక్షలు తీరకపోవడం వల్ల వచ్చే డిప్రెషన్... ఈ కారణాలన్నీ స్త్రీలలో సెక్స్ పట్ల విముఖత ఏర్పడి శృంగారాన్ని తిరస్కరించడానికి ఒక కారణం. ఒకవేళ కలయిక జరిగినా, డిప్రెషన్ వల్ల హార్మోనల్ ఇన్‌బ్యాలెన్స్ జరిగి అండం సరిగా విడుదల కాదు, ఫలితంగా గర్భం రాదు.
వ్జైనాలో ఉండే ఆమ్ల్ల, క్షార పీహెచ్లలో తేడాలు వీర్యకణాలను నాశనం చేస్తాయి. స్త్రీలు పూర్తిగా శృంగారంలో ఉద్దీపన చెందక పోవడం కూడా ఈ స్థితికి కారణం.
ఇవన్నీ.. స్త్రీపురుషుల్లో వంధ్యత్వానికి దారి తీసే కారణాలే. భార్యాభర్తలు ఇద్దరూ marital therapist వద్ద కౌన్సెలింగ్, థెరపీకి వెళ్లడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
డాక్టర్ భారతి
సెక్సాలజిస్ట్, సైకోథెరపిస్ట్, మెడిసిస్ హాస్పిటల్, ఎల్బీనగర్,
హైదరాబాద్. ఫోన్: 9849770409
ఈ మెయిల్: [email protected]
తాజావార్తలు
- ఆర్థిక వృద్ధి రేటులో తెలంగాణ టాప్
- భూక్యా లక్ష్మికి అరుదైన అవకాశం
- భర్తను చంపి అడవిలో పూడ్చి..
- సింధు నిష్క్రమణ
- అందమైన కుటుంబం.. అంతులేని విషాదం..
- వంద రోజుల్లో వెయ్యి కంటి శస్త్రచికిత్సలు
- అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
- వుయ్ షుడ్ నెవర్ వేస్ట్ గుడ్ క్రైసిస్: హీరో చైర్మన్
- ‘ఈడబ్ల్యూసీ’తో అగ్రవర్ణ పేదలకు న్యాయం : కేటీఆర్
- ఎనీ బుక్ @ ఇంటర్నెట్