వాస్తు

ఫర్నీచర్‌ను కూడా వాస్తుకు అనుకూలంగా పెట్టాలా? -కంచె ఆనంద్‌కుమార్, మూసాపేట
మనస్సు చాలా సూక్ష్మం. ఇది అంతరేంద్రియం. ఈ మానవ ప్రపంచంలో సమస్తం దీనికోసమే, దీని చుట్టే తిరుగుతున్నాయి. దీనిపై కనిపించేది, కనిపించనిది కూడా ప్రభావం కలిగిస్తుంది. అంతెందుకు, ఎదుటి మనిషి పెట్టుకున్న పొడవు బొట్టు కాస్త వంకరగా ఉన్నా చాలు, మనం అతనితో మాట్లాడటానికి చాలా ఇబ్బందిపడతాం. అతడు ఫ్రెండ్ అయితే కనుక, తగిన సూచనలు కూడా చేసి.. ఆ లోపమేదో సరిచేస్తాం. అమరిక అనేది ఎంతో గొప్పది. ఇంట్లో వాడుకునే కుర్చీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్ సరిగ్గా అమర్చకపోతే ఎంతో చికాకునకు గురి అవుతాం. ఫ్యాను రెక్క వంగినా, తలుపు చెక్క ఊడినా, ద్వారం తోరణం కిందకు జారినా, చెప్పు వంకర పడినా.. సక్రమంగా పెట్టేవరకూ మనకు తెలియకుండానే ఒకరకమైన అసంతృప్తికి గురి అవుతాం. కాబట్టి, గూటిలో ఫర్నీచర్‌ను క్రమపద్ధతిలో పెట్టుకోవాల్సిందే. ఒక హాలులో గుట్టగా పడున్న కుర్చీలను, చక్కగా వరుసల్లో అమర్చిన కుర్చీలను చూసినప్పుడు మనలో భావ సంతృప్తి వేరుగా ఉంటుంది. అంతెందుకు, రాశిపోసిన కాయగూరలకన్నా అందంగా బండిమీద పేర్చిన మామిడిపండ్లు మన దృష్టిని తొందరగా ఆకర్షిస్తాయి. అది అమరికలోని అంతరార్థం. సోఫాసెట్టు ద్వారానికి అడ్డంగా ఉంటే ఎంతో అనీజీగా అనిపిస్తుంది. డైనింగ్ టేబుల్ మీద అడ్డబీము ఉంటేనో, ఎదురుగా టాయిలెట్ ఉంటేనో కంఫర్ట్ అనిపించదు. కాబట్టి, ఫర్నీచర్‌ని ఇంటి డ్రాయింగ్ హాలు కొలతను అనుసరించి ఆయా మూలల్లో ఉండే స్థలానికి అనుకూలంగా కూర్చుకోవాలి. కుర్చీలను ఇంట్లోని మెట్ల కింద వేసుకొని కూర్చుంటే ప్రశాంతంగా ఉండదు. మెట్లు తలకు తగలని ఎత్తులో ఉన్నా కూడా! అద్దం కూడా అంతే (డ్రెస్సింగ్ టేబుల్) బల్బు కాంతి పరావర్తనం చెంది మన ముఖం మీద పడకుండా చూసుకోవాలి. ఇలా ఫర్నీచర్‌ను సక్రమంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంటి స్థలానికి ఈశాన్యంతో పాటు మరో దిక్కు పెరగొచ్చా? - వీరదాసు కిరణ్, కొంపల్లి
లోకంలో కొన్ని ప్రచారాలు చాలా లోతుగా వెళ్లిపోయాయి. అందులో ఈశాన్యం పెరగాలి అనేది ఒకటి. వాస్తవానికి అన్ని స్థలాలూ ఈశాన్యం మాత్రమే పెరిగి ఉండవు. పెరిగిన దిశకు అభిముఖంగా మరో దిక్కు కూడా పెరిగి ఉంటుంది. లేదా అన్ని మూలలూ సమానంగా ఉంటాయి. స్థలం పెరిగి ఉండటం ప్రధానం కాదు. దాని లక్షణాలు ‘ప్రాణం’ కలిగి ఉన్నాయా, లేదా? దిశను స్థిరపరుచుకొని ఉందా, లేదా? అన్నది చూడాలి. శాస్త్ర ప్రకారం రెండు ఈశాన్యాలు పెరగొచ్చు. అంటే.. తూర్పు ఈశాన్యం, ఉత్తర ఈశాన్యం పెరగొచ్చు. అలాగే దక్షిణ ఆగ్నేయం (తూర్పు ఆగ్నేయం కాదు), పశ్చిమ వాయవ్యం పెరిగి.. దక్షిణం రోడ్డు ఉంటే పనికిరాదు. అలాగే పడమర వాయవ్యం పెరిగి, పడమర రోడ్డు కలిగి ఉంటే ఆ స్థలం దోషపూరితం. వాటిని సరి చేయించుకోవాలి. స్థలాన్ని చతురస్రాకారంగా, దీర్ఘ చతురస్రంగా చేసుకొని ఈశాన్యం వైపు కొంత స్థలం మిగిలి ఉంటే దానిని ‘లెక్కను బట్టి’ కొంత మేర కలుపుకోవాలి.
వెలుతురు కోసం ప్రతి గదిలో స్లాబ్‌ను ఓపెన్‌గా పెట్టుకోవచ్చా?-మేఘనా చౌహాన్, ఎర్రమంజిల్
మన గ్రామాలల్లో పెంకుటిండ్లు కట్టే కాలంలో (ఇప్పటికీ) పెంకుల మధ్య ఒక ట్రాన్స్పరెంట్ అద్దాన్ని పెట్టుకుంటే రోజంతా బల్బు వేసినట్టు గొప్పకాంతి వస్తుంది. ఈ విధానం వల్ల గదిలో చీకటి ఉండేది కాదు. అయితే ఇప్పుడు స్లాబులకు కూడా కొందరు అద్దాలు బిగించుకుంటున్నారు. సన్‌లైట్ అద్దాలను నైరుతి మాస్టర్ గదికి మినహా.. హాలు మధ్యలో మిగతా పడకగదుల్లో పెట్టుకోవచ్చు. నైరుతి గదిలో అధిక వెలుగు నిద్రకు దూరం చేస్తుంది. మిగతా గదుల స్థానాలు వేరు కాబట్టి ఇబ్బంది ఉండదు. కేవలం అద్దాన్ని వెలుతురు కోసమే బిగించుకోవాలి కానీ కిటికీలా గాలి, వర్షం పడేలా ఏర్పాటు చేయడం మంచిదికాదు. గచ్చు ఇల్లు కట్టుకుంటే ఇంటి మధ్యలో వాన, ఎండ.. అన్నీ పడేలా ఏర్పాటు చేసుకోవచ్చు.
సుద్దాల సుధాకర్ తేజ
[email protected] , Cell: 7993467678
తాజావార్తలు
- రాష్ట్రంలో కొత్తగా 221 కరోనా కేసులు
- 20 లక్షల టీకాలు పంపిన భారత్.. ధన్యవాదాలు చెప్పిన బొల్సనారో
- గడిచిన 24గంటల్లో 14,256 కొవిడ్ కేసులు
- పదవి నుంచి తప్పుకున్న వుహాన్ మేయర్
- జార్ఖండ్ సీఎంను కలవనున్న తేజస్వీ యాదవ్
- తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు
- ట్రంప్ అభిశంసన.. ఫిబ్రవరిలో సేనేట్ విచారణ
- వరుణ్ ధావన్- నటాషా వివాహం.. టైట్ సెక్యూరిటీ ఏర్పాటు
- సరికొత్త రికార్డులకు పెట్రోల్, డీజిల్ ధరలు
- ఎలుక మూతి ఆకారంలో చేప.. ఎక్కడో తెలుసా?