Sunday
- Nov 01, 2020 , 01:17:21
ఆనందమే అందం

కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు దేశమంతా వ్యాపించినట్టు.. మలయాళ సీమలో పుట్టిన విద్యాబాలన్ పేరు కూడా దేశవ్యాప్తమైంది. ఆమెకు సినిమాల్లో అవకాశం ఇచ్చింది అందమే కావొచ్చు! కానీ, ఇండస్ట్రీలో అందలం ఎక్కించింది మాత్రం అభినయమే! వైవిధ్యభరితమైన చిత్రాలు, పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న విద్యాబాలన్ పర్సనల్ లైఫ్‌లోకి తొంగిచూస్తే ఆసక్తికరమైన సంఘటనలు, ఆదర్శవంతమైన సన్నివేశాలు ఎన్నో కనిపిస్తాయి.
- ఆనందంగా కనిపించడమే అసలైన అందమని అంటుంది విద్య. కానీ, బొద్దుగా ఉండటంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. చిన్నప్పుడు క్యూట్ బేబీ అన్నవాళ్లే కాస్త పెద్దయ్యాక ‘మరీ లావైపోతున్నావ్ జాగ్రత్త!’ అనేవారట. ఆ మాటలను సీరియస్‌గా తీసుకొని ఉపవాసాలు ఉండేదట విద్య.
- ఎన్నో ప్రయత్నాలు చేసి చివరికి బొద్దుగా ఉండటమే తన సౌందర్య రహస్యమనే నిర్ణయానికి వచ్చిందట విద్యాబాలన్. ఇష్టమైనవి తింటూ, నచ్చినట్టు ఉంటూ ఆనందంగా ఉండటమే లక్ష్యంగా చేసుకుంది. అప్పటి నుంచి నా బరువు నిలకడగా ఉందని చెబుతుంటుంది విద్య.
- బరువు పెరుగుతున్నదని 17 ఏండ్లు ఉన్నప్పుడు విద్యను ఆమె తల్లిదండ్రులు ఓ వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లారు. రోజూ 10 లీటర్ల నీళ్లు తాగితే బరువు తగ్గుతుందన్న వైద్యుడి సలహాను చాలా రోజులు పాటించిందట. కానీ, కొన్నాళ్లకు షరా మామూలే!
- మనిషి జీవితంలో ఎత్తుపల్ల్లాలు సహజం. ఆ క్షణంలో బాధలు, సంతోషాలు కలిగే మాట వాస్తవం. అయితే, అది గెలుపైనా, ఓటమైనా.. జీవితానికి ఒక పాఠం చెబుతుంది.
- అమ్మకు అన్నీ భయమే! అందుకే చాలా కట్టడి చేసేది. నేనేమో ప్రతి విషయంలోనూ బెట్టు చేసేదాన్ని. నా కలలకు అమ్మ అడ్డుగా ఉందని అనుకునేదాన్ని. కానీ, అమ్మ మనసు ఇప్పుడు అర్థమైంది.
- కెమెరా ముందుకు వచ్చిన తర్వాత విద్య ఇతర విషయాలేవీ పట్టించుకోదు. ఎంజాయ్ చేస్తూ నటిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా పరిణతిని ప్రదర్శిస్తుంది. ‘కెమెరా ముందు నుంచి పక్కకు రాగానే ఏవేవో విషయాలు నా
- మనసును చుట్టుముట్టేస్తాయి. ఒక్కోసారి సమస్యల వలయంలో ఉన్నానా అనిపిస్తుంటుంది. ఇబ్బందులేం లేకపోయినా.. ఎందుకో అలా అనుకుంటాను. ఇది నా బలహీనత’ అంటుంది విద్యాబాలన్.
- లాక్డౌన్ టైమ్‌లో అనుబంధాలు పెరిగాయని చెబుతుంది విద్య. ఆర్థిక, ఉపాధి సమస్యలు పక్కనపెడితే కుటుంబపరంగా ఒకరిపై ఒకరికి నమ్మకం, ఆప్యాయత పెరిగాయని అంటున్నది. తనకూ అలాంటి అనుభూతే కలిగిందని చెబుతున్నది.
- కరోనా వేళ ఇంట్లోనే ఉండిపోవడంతో కొత్త విషయాలు ఎన్నో నేర్చుకున్నానంటున్నది విద్య. మొదటిసారిగా వంటింట్లో గరిట పట్టిందట ఈ కేరళ కుట్టి. తనకు ఇష్టమైన వంటకాలు వండి ఇంట్లో వాళ్లకూ రుచి చూపించిందట.
తాజావార్తలు
- శ్రీలంకకు ఐదు లక్షల డోసుల వ్యాక్సిన్ గిఫ్ట్..
- వార్తలలోకి 'మనం 2'.. ఆసక్తిగా గమనిస్తున్న ఫ్యాన్స్
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారు.. ఇద్దరు సజీవ దహనం
- ఫిబ్రవరి 1 నుంచి వైద్య కళాశాలలు పునఃప్రారంభం
- ఢిల్లీలో వందలోపే కరోనా కేసులు.. 9 నెలల్లో ఇదే ప్రథమం
- ఢిల్లీని కప్పేసిన మంచుదుప్పటి.. రైళ్లు ఆలస్యం
- పెళ్లి పీటలెక్కిన టీమిండియా ఆల్‌రౌండర్
- కేరళ బాట పట్టనున్న పుష్ప టీం
- భీవండి పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం
- ‘ఎంజీఎంలో’ కొండెంగ.. కోతుల బెడద తప్పిందంటున్న సిబ్బంది
MOST READ
TRENDING