శుక్రవారం 22 జనవరి 2021
Sunday - Nov 01, 2020 , 00:29:10

మీకు పై పేరుందా?

మీకు పై పేరుందా?

ప్రతి మనిషికీ బాల్యం నుంచి పెద్దయ్యే వరకూ.. ఎవరో ఒకరు ఏదో ఓ ‘పై పేరు’ (నిక్‌నేమ్‌) పెడతారు. ఆకారం వల్లనో, మాట్లాడే తీరు వల్లనో, ప్రవర్తన వల్లనో, చేష్టల వల్లనో .. పై పేర్లు పుట్టుకొస్తుంటాయి. ఉదాహరణకు.. లావుగా ఉన్నవాళ్లను లడ్డుగాడు, పిసినారితనంగా ప్రవర్తించే వాళ్లను పీసోడు, కోతి చేష్టలు చేసేవారిని కోతోడు అని, జుట్టు సరిగా ముడివేసుకోని పిల్లను ‘సిప్పిరింటికల్ది’ అని వ్యంగ్యంగా పిలుస్తుంటారు. ఇవి చిన్నప్పటి సరదా సంబోధనలే అయినా.. పెద్దయ్యాక ఆ పేరుగల వ్యక్తి తారసపడితే.. బాల్యమంతా ఒక్కసారిగా కళ్లముందు కదలాడుతుంటుంది.


logo