పుస్తక సమీక్ష

‘నువ్వు సంతోషాన్ని కొనలేవు... కానీ పుస్తకాలని కొనగలవు. నిజానికి ఆ రెండూ ఒకటే!’.
- అజ్ఞాతవ్యక్తి
జీవిత కోణాలు పంజరం విడిచి
రచయిత్రి: స్వాతి శ్రీపాద
పేజీలు: 192, ధర: రూ.100
ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు
మన జీవితంలో ఎదురయ్యే ప్రతి సన్నివేశం మనసులో ఒక ముద్ర వేసుకుంటుంది. అది వ్యక్తిగత జీవితానికి ముడిపడి ఉన్నది కావొచ్చు. ఇతరుల వ్యక్తిత్వాన్ని పరిచయం చేసేదైనా కావొచ్చు. దానికి కొంత భావుకత జోడించగలిగితే ప్రతి సందర్భమూ ఒక అందమైన కథగా రూపాంతరం చెందుతుంది. చేయాల్సిందల్లా సంకోచాల ‘పంజరం విడిచి’ కలం విదిలించడమే. అప్పుడే అక్షరాలు స్వేచ్ఛగా జాలువారుతాయి. సన్నివేశాలు రక్తికడతాయి. ‘పంజరం విడిచి’ కథా సంకలన కర్త స్వాతి శ్రీపాద మన జీవితాలతో ముడిపడి ఉన్న సందర్భాలనే కథావస్తువులుగా ఎంచుకున్నారు. ఆధునిక సామాజిక నేపథ్యాలను హృద్యంగా ఆవిష్కరించారు. లలితమైన భాష, అందమైన వ్యాఖ్యా నాలు.. చదువుతున్నంత సేపు ఆ పాత్రలు మన కండ్ల ముందే ఉన్నాయా అనిపిస్తుంది. చదవడం పూర్తయిన తర్వాత కొన్ని కథలు, అందులోని పాత్రలు మన మస్తిష్కంలో స్థిరనివాసం ఏర్పరచుకుంటాయి. ముప్పయ్ కథలు.. ముప్పయ్ కోణాలను స్పృశిస్తాయి. వ్యక్తిని, మనసును, సమాజాన్ని ప్రశ్నిస్తాయి. కథలో అంతర్లీనంగా ఉన్న జవాబును కనుక్కోగలిగితే ఎన్నో సమస్యలకు ‘ప్రిస్క్రిప్షన్' లభించినట్టే!
బతుకు కథలు
రూబిడి తెలంగాణ కథ 2019
సంపాదకులు: సంగిశెట్టి శ్రీనివాస్, వెల్దండి శ్రీధర్
పేజీలు: 128, వెల: 70/-
ప్రతులకు: ప్రముఖ పుస్తకకేంద్రాలు
తెలంగాణ బతుకుకు తనదైన అస్తిత్వం ఉంది. కాబట్టి, ఆ బతుకులో పుట్టిన కథలకు ఓ వైవిధ్యం ఉండి తీరుతుంది. అందుకే ‘సింగిడి- తెలంగాణ రచయితల సంఘం’ ఏటా వెలువరిస్తున్న కథా సంకలనం ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. రూబిడి పేరిట వెలువడుతున్న ఈ సంకలనం 2019 సంవత్సరంలోని ఉత్తమ కథల సమాహారం. రూబిడి అంటే రూఢి అనే అర్థం కూడా వస్తుంది. పేరుకు తగినట్టుగానే మట్టి జీవితాలకు సాక్ష్యంగా నిలుస్తాయీ కథలు. ఇందులో స్థానం దక్కించుకున్న చాలామంది రచయితలు పాఠకులకు కొత్తేమీ కాదు. వారి శైలీ, వస్తువులూ సాహితీలోకానికి పరిచయమే. అయినా, ఇంకోసారి ఆ అక్షరాలు మనల్ని మరోలోకానికి తీసుకుపోతాయి. అనుబంధాల లెక్కల గురించి ‘ఎక్కాలు రానోడు’, తల్లి ప్రేమకు అద్దం పట్టే ‘ఇత్తరాకుల తట్ట’, కులవివక్షను కండ్లకు కట్టే ‘ఆరు తప్పులు’, రైతుల వ్యధతో గుండెను తడిమే ‘గుండెనిండా జీలుబండనే’... లాంటి నేపథ్యాలతో ఒక్కో కథా ఒక్కో పార్శాన్ని తడుముతుంది. ఆయా రచయితల పరిచయాలతో పాటు చదవాల్సిన మరికొన్ని కథల జాబితా సంకలనానికి పరిపూర్ణతను తీసుకువచ్చింది.
తెన్నేటి సుధ వ్యాసకదంబం
రచయిత్రి: తెన్నేటి సుధాదేవి
పేజీలు: 216 వెల: 150/-
ప్రతులకు: 80963 10140
జొన్నకంకి (కవిత్వం)
రచయిత్రి: నాంపల్లి సుజాత
పేజీలు: 128 వెల: 100/-
ప్రతులకు: 98480 59893
సమాంతర స్వప్నం
రచయిత: ఏనుగు నరసింహారెడ్డి
పేజీలు: 80, వెల: 100/-
జీవితం గీసిన చిత్రాలు
రచయిత: సతీష్ గొల్లపూడి
పేజీలు: 92, వెల: 100/-
ప్రతులకు: 040-27678430
తాజావార్తలు
- ఇంటర్ తరగతుల నిర్వహణలో స్వల్ప మార్పులు
- సీ మ్యాట్ దరఖాస్తుల గడువు పొడిగింపు
- ట్రక్కు, జీపు ఢీ.. ఎనిమిది మంది మృతి
- సింగరేణి ఓసీపీ-2లో ‘సాలార్' చిత్రీకరణ
- ఆల్‌టైం హైకి పెట్రోల్, డీజిల్ ధరలు
- రాష్ర్టంలో పెరుగుతున్న గరిష్ఠ ఉష్ణోగ్రతలు
- ముస్లిం మహిళ కోడె మొక్కు
- ముగియనున్న ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ దరఖాస్తు గడువు
- వనస్థలిపురం ఎస్ఎస్ఆర్ అపార్టుమెంటులో అగ్నిప్రమాదం
- 27-01-2021 బుధవారం.. మీ రాశి ఫలాలు