గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Oct 18, 2020 , 00:44:01

ఇంటి నిండా పాండాలే

 ఇంటి నిండా పాండాలే

హాయ్‌ పిల్లలూ! ఈ ప్రపంచంలో ఒక్కొక్కరికీ ఒక్కో అభిరుచి ఉంటుంది. ఎన్నో పనులు ఇష్టంగా అలవాటు చేసుకుంటారు.   రకరకాల వస్తువులను సేకరించడాన్ని హాబీగా ఎంచుకుంటారు. ఈ తాతయ్య అలవాటేమో...  ‘పాండా బొమ్మలను సేకరించడం’.

సెలిన్‌ కార్నెట్‌ అనే ఈ తాతయ్యది బెల్జియం. ఆయన ఇంట్లోకి వెళ్తే అన్నీ పాండా బొమ్మలే కనిపిస్తాయి. పాండాలంటే తెలుసు కదా! తెలుపు, నలుపు రంగులో ముద్దు ముద్దుగా ఆకట్టుకుంటాయి. అవి అరుదైన జంతువులు కాబట్టి ప్రభుత్వాలు వాటిని జాగ్రత్తగా అడవుల్లోనే సంరక్షిస్తున్నాయి. ఇంట్లో పెంచుకోవడానికి వీలు లేదు. దీంతో, తాతయ్య తనకు ఇష్టమైన పాండా బొమ్మలను  సేకరిస్తున్నాడు. 1978లో సెలిన్‌ ట్రక్‌ డ్రైవర్‌గా పని చేసేవాడు.  అక్కడక్కడా దుకాణాల్లో కనిపించే పాండా బొమ్మలను తన భార్య ఆండ్రీ కార్నెట్‌కు బహుమతిగా ఇచ్చేవాడు. క్రమంగా ఆండ్రీకి పాండా బొమ్మలంటే ఇష్టం ఏర్పడింది. దీంతో రకరకాల పాండా బొమ్మలను సేకరించడం ప్రారంభించాడు. తమ దగ్గర  మూడువేల  పాండా బొమ్మలు ఉన్నట్టు ఈ దంపతులు చెప్పారు.  వీటిని  పిల్లలకు కానుకగా ఇస్తామని ఇటీవలే ప్రకటించారు.


logo