గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Oct 11, 2020 , 03:27:20

ఐతారం దావత్‌ దిల్‌సే ఖాయా పాయా!

ఐతారం దావత్‌ దిల్‌సే ఖాయా పాయా!

మాంసాహారం అంటే ఇష్టపడని వాళ్లు ఉండరు. అందులోనూ, చికెన్‌ కంటే కూడా మటన్‌నే మక్కువతో ఆరగిస్తారు. మటన్‌ శరీరానికి తగిన ్రప్రొటీన్లను ఇవ్వడమే కాదు, శరీర నిర్మాణ ప్రక్రియలో ఎంతో తోడ్పడుతుంది. నేరుగా మటన్‌ తినడం కంటే, మటన్‌ సూప్‌ తాగడం ఆరోగ్యానికి మంచిదని అంటారు. కాబట్టే, నవాబుల నుంచీ గరీబుల వరకూ పాయా అంటే ప్రాణమిస్తారు.  

    • చాలా సందర్భాల్లో సంప్రదాయ వైద్యులు పాయాను ఓ ఔషధంలా సిఫార్సు చేస్తారు. దీనివల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు మేక కాళ్ల సూప్‌ తాగాలని చెబుతారు. జ్వరం తర్వాత వెంటాడే నిస్సత్తువనుజయించడానికి పాయాను మించిన ఔషధీకృత ఆహారం లేదు.   
  • జొన్నరొట్టెను మటన్‌ పాయతో కలిపి తింటే అద్భుతః ఒక్కసారి రుచి చూస్తే, ఎవరైనా సరే ఫిదా కావాల్సిందే. అతి సర్వత్ర వర్జ్యయేత్‌ అన్న మాట పాయాకూ వర్తిస్తుంది. వారానికి ఒకటిరెండుసార్లకు మించి తీసుకోకూడదు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మసాలా ఘాటు తగ్గించుకోవడం ఉత్తమం. నూనె వాడకంలోనూ జాగ్రత్తలు పాటించాలి. 
  • క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం పాయాలో పుష్కలంగా లభిస్తాయి. కొలెస్ట్రాల్‌ నియంత్రణలోకి వస్తుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. వేగంగా బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది. ఒంట్లోని వ్యర్థాలు బయటికి వెళ్తాయి. రక్తంలో చక్కెర స్థాయిని స్థిరంగా ఉంచుతుంది. డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. చర్మం మెరుస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. మంచి నిద్రపట్టేలా చేస్తుంది.
    కుతుబ్‌ షాహీలు, అసఫ్‌జాహీల కాలంలో కూడా శుభకార్యాలు, వేడుకలు జరిగినప్పుడు పాయ వడ్డించేవారని చరిత్రకారుల అభిప్రాయం.
  •  శీతాకాలంలో ఉదయమూ సాయంత్రమూ పాయా ఆరగించేందుకు ఆసక్తి చూపుతారు భోజన ప్రియులు.
    • ప్రెషర్‌ కుక్కర్‌లో టీ స్పూన్‌ నూనె వేసి అందులో ఆవాలు, మిరియాలు, లవంగాలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. కాసేపటి తర్వాత మటన్‌ బోన్స్‌ వేసుకోవాలి. బాగా కలుపుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. అనంతరం కరివేపాకు, పసుపు వేయాలి. కొద్దిగా ఉప్పువేసి మరో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి వేసి మరో పది నిమిషాలు మగ్గించాలి. అనంతరం ధనియాల పొడి, మిరియాల పొడి, కొత్తిమీర వేసి నీళ్లు పోయాలి. కుక్కర్‌ మూత పెట్టి ఐదు నుంచి ఏడు విజిల్స్‌ వచ్చే వరకు ఉడికించాలి. అనంతరం మిరియాల పొడి, కరివేపాకు వేసి దించేయాలి.


logo