మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 23:43:41

గ్లోబ్‌ పుట్టిందెప్పుడు?

గ్లోబ్‌ పుట్టిందెప్పుడు?

ప్రపంచ దేశాలను, వాటి నైసర్గిక  స్వరూపాలను గ్లోబ్‌ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రజ్ఞుడు నికొలస్‌ కొపర్నికస్‌ ఖగోళ పరిశోధనలకు, సూర్యకేంద్ర సిద్ధాంతాలకు ఆకర్షితుడైన మార్టిన్‌ బెహాయిమ్‌ (జర్మనీ) గ్లోబ్‌కు ప్రాథమిక రూపాన్ని ఇచ్చాడు. అప్పటికే ఆయన మ్యాప్‌లను రూపొందించడంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.  కొపర్నికస్‌ను స్ఫూర్తిగా తీసుకుని, ఆయనంతటి పేరు  సంపాదించాలని తెగ ఆరాటపడేవాడు మార్టిన్‌. చివరికి 1492లో గ్లోబ్‌కు రూపకల్పన చేసి అనుకున్నది సాధించగలిగాడు.  ఆ తరువాత కాలంలో అదనపు సమాచారంతో తయారైన ఆధునిక గ్లోబ్‌లు ప్రపంచదేశాలన్నింటా ప్రముఖ స్థానం సంపాదించుకున్నాయి.


logo