శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 23:40:19

పక్షీ పక్షీ నువ్వెక్కడ?

పక్షీ పక్షీ నువ్వెక్కడ?

‘చేపా చేపా నువ్వెందుకు ఎండలేదూ అంటే.. గడ్డిమోపు అడ్డు వచ్చిందని’ చెప్పిందట. అదే ప్రశ్న ఇప్పుడు కొన్ని పక్షులను ‘పక్షీ పక్షీ నువ్వెక్కడా?’ అని అడిగితే, ‘నేను.. అంతరించిపోయాను’ అని చెప్పుకొనే స్థితి వచ్చింది.  ప్రపంచంలో సుమారు 18వేల పక్షిజాతులు ఉన్నాయి.  అవీ ఏటా అంతరించిపోతున్నాయి. అలా కనుమరుగయిన అందమైన పక్షులు ఇవి. 

మిడోలార్క్‌: ‘మిడోలార్క్‌'  పక్షి పసుపు రంగు కంఠంతో చూడముచ్చటగా ఉంటుంది. వీటి   సంఖ్య రోజు రోజుకీ తగ్గిపోతున్నది. జార్జ్‌ టైన్‌ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ పీటర్‌ మర్రా నేతృత్వంలో ఓ బృందం  ఈ పక్షులపై అధ్యయనం చేసింది. ఆ లెక్కల ప్రకారం.. ప్రకారం యాభై యేండ్ల క్రితం అపారంగా ఉన్న ఈ  పక్షుల సంఖ్య  ప్రస్తుతం 29 శాతం తగ్గింది. ఉత్తర అమెరికాలో విరివిగా కనిపించే ‘మిడోలార్క్‌' పక్షులు ఏటా  లక్షలాదిగా కనుమరుగవుతున్నాయి.  

హనీ క్రీపర్‌: హనీ క్రీపర్‌ దాదాపూ అంతరించిన పక్షి. 1973లో దీనిని మొదటిసారి గుర్తించారు. హవాయి దీవుల్లో ఎక్కువ కనిపించేది. చివరిసారిగా 2004లో దర్శనమిచ్చింది.  ఈ పక్షిని ‘పూ-ఉలి’ అని కూడా పిలుస్తారు. దీని ముఖం నల్లగా ఉంటుంది. అందుకే బ్లాక్‌ ఫేస్డ్‌ హనీక్రీపర్‌ అని కూడా అంటారు. 1998లో ఈ పక్షులను మూడింటిని గుర్తించారు. వాటిలో ఒకటి 2004లో చనిపోయింది. మిగతా రెండింటి జాడ తెలియలేదు.    

స్పిక్స్‌ మకావు :  ఇది బ్రెజిల్‌కు చెందిన రామచిలుక జాతి పక్షి.  నీలి రంగులో భలేగా ఉంటుంది. 2011లో వచ్చిన డిస్నీ మూవీ ‘రియో’లో ఈ బ్లూ ప్యారట్‌ గురించి ఉంటుంది. అంతరించిపోయిన జాతుల్లో ఇది కూడా ఉంది.


logo