ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 23:17:08

‘ఫల’హారం.. సీతాఫలం ఫ్రూటీ

‘ఫల’హారం.. సీతాఫలం ఫ్రూటీ

కావాల్సిన పదార్థాలు :

  • పండిన సీతాఫలాలు :  ఐదు, యాపిల్‌ : ఒకటి, దానిమ్మ పండు : ఒకటి, అరటి పండు : ఒకటి, తెల్లద్రాక్షలు : 100గ్రా., టూటీ ఫ్రూటీలు : 100 గ్రా., పాలు : లీటరు
  • చక్కెర : 150 గ్రా., కాజూ : 100 గ్రా., యాలకులు : నాలుగు

తయారు చేసే విధానం :

సీతాఫలాల గింజల నుండి గుజ్జును వేరు చేసుకోవాలి. దీనికి అరటిపండు, కాచి చల్లార్చిన పాలు కలిపి మిక్సీలో వేసి కొద్దిసేపు గ్రైండ్‌ చేసుకోవాలి. తర్వాత చక్కెర, యాలకుల పొడి, బాగా మరిగించి చల్లార్చిన పాలు పోసి మరికొంతసేపు గ్రైండ్‌ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలో వేసుకొని దానిమ్మ గింజలు, చిన్నగా తరిగిన యాపిల్‌ ముక్కలు, వేయించిన కాజూ, టూటీ ఫ్రూటీ, గింజలు తీసిన తెల్లద్రాక్ష ముక్కలు వేసి బాగా కలిపి సర్వ్‌ చేయాలి. ఈ సీతాఫల ఫ్రూటీని పిల్లలు లొట్టలేసుకుంటూ తింటారు.

సీతాఫల్‌ ఖండ్‌

కావాల్సిన పదార్థాలు 

  • బాగా పండిన సీతాఫలాలు : ఐదు
  • పాలు : ఒక లీటరు, చక్కెర : 150గ్రా., 
  • గోధుమ రవ్వ : 200 గ్రా., కాజూ : 100 గ్రా., 
  • కిస్‌మిస్‌ : 100 గ్రా., యాలకులు : 6
  • నెయ్యి : 150 గ్రా.

తయారు చేసే విధానం :

సీతాఫలాల్ని గింజల నుండి గుజ్జును వేరు చేసి మిక్సీలో వేసి ముందు పాలు కొద్దిగా వేడి చేసి చల్లార్చి ఇందులో పోసి గ్రైండ్‌ చేయాలి. తర్వాత బాగా మరిగించిన పాలు కలపాలి. స్టౌ మంట తగ్గించి పంచదార, పొడి చేసి యాలకులు వేసి పది నిమిషాల తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. గోధుమ రవ్వను నెయ్యిలో వేయించి అందులో కొద్దిగా నీరు పోసి ఉడకనిచ్చి బాగా చల్లారనివ్వాలి. తర్వాత అందులో పాలు, వేయించిన కాజూ, కిస్‌మిస్‌, సీతాఫలం గుజ్జును బాగా కలిపి సర్వ్‌ చేయాలి.


logo