శుక్రవారం 30 అక్టోబర్ 2020
Sunday - Oct 10, 2020 , 22:50:03

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం

వారం ప్రారంభంలో ఖర్చులు ఉండవచ్చు. క్రమేపీ సర్దుకుంటాయి. ఆలోచనలకు తగినట్లుగా పనులు నిర్వహిస్తారు. సమస్యలను అధిగమిస్తారు. తలచిన పనులలో అనుకూలత ఉంటుంది. పరిచయాలవల్ల పనులు నెరవేరుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భక్తిభావనలు పెంపొందుతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలకు హాజరవుతారు. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. విద్యార్థులకు మంచి సమయం. చదువులో రాణిస్తారు. అనుకున్న ఫలితాలు ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార విస్తరణలో భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. నూతన పనులకు శ్రీకారం చుడతారు. ఆస్తుల కొనుగోలు ఆలోచనలు ఫలిస్తాయి. క్రయ విక్రయాల వల్ల ఆదాయం పెరుగుతుంది. 

వృషభం

ఈ వారం మధ్యలో కొన్ని ఇబ్బందులు రావచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. సలహాలు, సూచనలకు ప్రాధాన్యమిస్తారు. ప్రారంభించిన పనులపై మనసు నిలిపి పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆలోచనలకు స్వస్తి పలికి కార్య నిర్వహణపై మనసు నిలపాలి. సోదరులతో పనులు నెరవేరుతాయి. చిన్నచిన్న మనస్పర్థలు ఉన్నా వాహనాల వల్ల పనులు సంతృప్తిగా నెరవేరుతాయి. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం సానుకూలంగా ఉంటుంది. సమాజంలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందవచ్చు. 

మిథునం

వారం మధ్యలో అనవసరమైన ఆలోచనల మూలంగా పనులలో ఆలస్యం ఉండవచ్చు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి. ఆహార నియమాలను పాటించాలి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతతో పనులు చేస్తారు. బంధుమిత్రులతో చిన్న చిన్న మనస్పర్థలు ఉండవచ్చు. పెద్దల సహాయ సహకారాలు సమయానికి అందుతాయి. మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. చేపట్టిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఆర్థిక సమస్యల మూలంగా కొంత ఆలస్యమైనా సత్ఫలితాలను పొందుతారు. ప్రయాణాలవల్ల వృథా ఖర్చులు ఉండవచ్చు. అనవసరమైన వాటిని వాయిదా వేసుకోవడం మంచిది. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. 

కర్కాటకం

వారం చివరిలో ఖర్చులు ఉండవచ్చు. చికాకులు దూరమవుతాయి. నిలిచిన పనులలో కదలిక, పరిచయాలతో అదృష్టం కలిసి వస్తుంది. ఆలోచనలను అమలు చేస్తారు. మిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. గృహ నిర్మాణ పనులలో ఆలస్యం ఉంటుంది. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. రావలసిన డబ్బు చేతికందడంలో కొంత వివాదం ఉండవచ్చు. సంతృప్తిగా ఉంటారు. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. పిల్లల వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. పనులలో అందరి సహకారం లభిస్తుంది. ఆర్థిక సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆర్థిక సమస్యలు తప్పవు. ఖర్చుల నియంత్రణ అవసరం. బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి.

సింహం

వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు ముందుకు రావచ్చు. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. రావలసిన డబ్బు చేతికి అందడం వల్ల ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కష్టానికి తగిన ఫలితాలు ఉంటాయి. ఆత్మీయులు, సోదరులు, మిత్రులతో మనస్పర్థలు ఉండవచ్చు. జాగ్రత్త అవసరం. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి పనులపై మనసు నిలిపితే సత్ఫలితాలు ఉంటాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనివారితో పూర్వ సమస్యలు దూరమవుతాయి. నూతన పనులను ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య విషయంలో ముందుకంటే మెరుగ్గా ఉంటుంది. 

కన్య

ఈ వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. న్యాయవాద వృత్తిలో ఉన్నవారికి కలిసి వస్తుంది. కోర్టు పనులు సకాలంలో పూర్తవుతాయి. చిన్న మొత్తంలో చేసే వ్యాపారస్తులకు లాభిస్తుంది. సంఘంలో పెద్దల సహకారాలు లభిస్తాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. మంచి ఆలోచనలు స్ఫురిస్తాయి. మానసికంగా సంతృప్తిగా ఉంటారు. సంగీత, సాహిత్య, కళాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఇంట్లో సంతృప్తిగా ఉంటారు. ప్రభుత్వ, రాజకీయ పనులలో అవాంతరాలు ఉండవచ్చు. ద్విగుణీకృత ప్రయత్నాలు అవసరం. పట్టుదలతో పనులు చేయడం ఈ వారం అవసరం. 

తుల

వారం చివరిలో అనుకోని ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు సామాన్యంగా ఉంటాయి. బంధుమిత్రులతో సత్సంబంధాల వల్ల చాలా పనులు పూర్తవుతాయి. ఇంట్లో సానుకూల వాతావరణం ఉంటుంది. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో తాత్కాలిక ప్రయోజనాలు, లాభాలు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అందరినీ కలుపుకొని సామరస్యంగా పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. లాభదాయకంగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల కలయిక సంతృప్తినిస్తుంది. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం తీసుకుంటూ, ముందుకు వెళ్లడంతో అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు తాత్కాలిక లాభాలు ఉంటాయి. మానసికంగా సంతృప్తి.

వృశ్చికం

వారం చివరిలో అనుకోని ఖర్చులు ముందుకు వస్తాయి. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆఫీసులో అందరి సహాయ సహకారాలను పొందుతారు. అధికారుల ప్రశంసలు, తోటి ఉద్యోగుల చేయూతతో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. కొత్త పనులు చేయడానికి ప్రయత్నిస్తారు. వృత్తి, వ్యాపారం, ఉద్యోగాలలో రాబడి స్థిరంగా ఉంటుంది. ఆదాయం కొంతవరకు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. పాత పనులలో కదలిక ఉంటుంది. అందరితో సామరస్యంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. మంచి సంస్థలలో ఉన్నత విద్యకై చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

ధనుస్సు

వారం ప్రారంభంలో ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు సామాన్యంగా ఉంటాయి. ఆహారం పట్ల జాగ్రత్తలు అవసరం. తాత్కాలికంగా ఈ వారం కలిసి వస్తుంది. పెద్ద పెట్టుబడులతో చేసే పనులను వాయిదా వేసుకోవడం మంచిది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు బాగా పొందుతారు. మంచిపేరు సంపాదిస్తారు. పై అధికారులతో ఇబ్బందులు ఉండవచ్చు. జాగ్రత్తలు అవసరం. అన్ని విషయాలలోనూ తాత్కాలిక లాభాలు ఉంటాయి. శ్రద్ధతో పనులు చేస్తే సత్ఫలితాలను పొందుతారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో గతంతో పోల్చితే ఈ వారం సానుకూలంగా ఉంటుంది. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. 

మకరం

వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు. మిగతా రోజులు కలిసి వస్తాయి. ఓపికతో, శ్రద్ధతో పనులు చేస్తారు. ఉత్సాహంతో, సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. బంధుమిత్రులు, సోదరుల సహాయ సహకారాలు ఈ వారం బాగా ఉంటాయి. మంచి ఫలితాలను పొందుతారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. చర్చలు, సంప్రదింపుల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. సమాజంలో మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. మంచిపేరు సంపాదిస్తారు. వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. వివాదాలలో పైచేయి సాధిస్తారు. అనవసరమైన వాటికి స్వస్తి పలకడంతో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. 

కుంభం

వారాంతంలో అనవసరమైన ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలం. సమయానుకూలంగా వ్యవహరిస్తారు. బంధుమిత్రుల సహాయ సహకారాలతో పనులు నెరవేరుతాయి. గొప్పవారి పరిచయాల వల్ల కార్య సాఫల్యత ఉంటుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ వారం ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలి. నియమాలను పాటించాలి. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. అనవసరమైన ఖర్చులు ముందుకు రావచ్చు. నియంత్రణ అవసరం. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పిల్లల విషయంలో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. 

మీనం

వారం చివరిలో ఊహించని ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలం. పూర్వం ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలు చేస్తారు. నిలిచిపోయిన పనులను పునఃప్రారంభిస్తారు. చాలా విషయాలలో మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. పూర్వ పెట్టుబడులలో లాభాలు ఉంటాయి. పనివారితో అనుకూలత ఉంటుంది. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. కోర్టు వ్యవహారాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసి వస్తాయి. అనవసరమైన ఆలోచనలను విడనాడి పనులపై మనసు నిలుపుతారు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగం స్థిరంగా ఉంటుంది.