బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 22:00:55

అంతరించిన పక్షి.. జెయింట్‌ మో

అంతరించిన పక్షి.. జెయింట్‌ మో

హాయ్‌ పిల్లలూ! మనం నిత్యం ఎన్నో పక్షులనూ, జంతువులనూ చూస్తూ ఉంటాం. కానీ మనకు తెలియకుండానే అనేక జీవులు అంతరించిపోయాయి. వాటిలో ‘జెయింట్‌ మో’లు కూడా ఉన్నాయి.

ఇది చూడటానికి అచ్చం  ఉష్ట్రపక్షి(ఆస్ట్రిచ్‌)లా ఉంటుంది. ఇవి ప్రపంచంలోని పక్షులన్నింటిలోనూ  పెద్దవి. జెయింట్‌ మోలు 17వ శతాబ్దంలోనే అంతరించిపోయాయి. ఇవి న్యూజిలాండ్‌లోఎక్కువగా ఉండేవి.  వీటికి రెక్కలుండవు. కాబట్టి ఎగురలేవు, వేగంగా పరిగెత్తలేవు. వీటి పొడవు 4 మీటర్లు. చిన్న తల, మందమైన ముక్కు, పొడవాటి మెడ, బలమైన శరీరంతో పాటు ఎంత దూరం నుంచైనా వాసనను పసిగట్టగలవు. ఇవి ఎక్కువగా ఆకులనూ, చిన్న చిన్న కొమ్మలనూ, ఆడవుల్లో దొరికే పండ్లనూ తింటాయి. సాధారణంగా, పక్షులు ఆహారంగా తీసుకున్న వాటిని నమలలేవు. అందుకని అవి జీర్ణం కావడానికి రాళ్లను మింగుతాయి. రాళ్ల కింద పడిన ఆహారం మెత్తగా అయిపోయి జీర్ణమవుతుంది. అలాగే ఈ జెయింట్‌ మోలు కూడా ఆహారాన్ని జీర్ణం  చేసుకోవడానికి రాళ్లు మింగుతాయి. పొడవాటి మెడ ఉన్నందు వల్ల 3 మీటర్ల ఎత్తు నుంచి కూడా ఆహారాన్ని సేకరించగలవు. ఈ జాతిలో ఆడ, మగ పక్షుల్లో చాలా తేడాలుంటాయి. ఆడ పక్షులు మగ పక్షుల కన్నా పొడవులో 1.5 రెట్లు, బరువులో 2.8 రెట్లు అధికం. ఇవి దాదాపు 76 కేజీల నుంచి 242 కేజీల వరకు బరువు ఉంటాయి. అంటే మనిషి బరువు కన్నా మూడు రెట్లు ఎక్కువ. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు పెడతాయి.  మగ పక్షులు 34 నుంచి 85 కేజీల బరువు మాత్రమే ఉంటాయి. కివీ పక్షుల్లాగా మగ జెయింట్‌ మోలు గుడ్లపై కూర్చుంటాయి. ఈ పక్షులను జిరాఫీ బర్డ్స్‌ అని కూడా అంటారు. పరిశోధకులు వీటి అస్తిపంజరాలను సేకరించి మ్యూజియంలో ఉంచారు.


logo