బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Oct 03, 2020 , 21:45:36

బిస్కెట్‌ .. బాస్కెట్‌!

బిస్కెట్‌ .. బాస్కెట్‌!

సాదా బిస్కెట్లు

కావలసిన పదార్థాలు

మైదా : అర కేజీ

గుడ్లు : నాలుగు, పంచదార పొడి : పావు కేజీ

చాక్లెట్‌ పొడి : ఒక టీస్పూను, మీగడ : రెండు టీస్పూన్లు

వంటసోడా : చిటికెడు, యాలకులపొడి : పావు టీస్పూను

తయారుచేసే విధానం

గుడ్లసొన, పంచదార పొడి, చాక్లెట్‌ పొడి, మీగడ, వంటసోడా, యాలకులపొడి కలిపి మిక్సీలో వేసి ఒక నిమిషం తర్వాత తీసి మైదాపిండిలో కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. పది నిమిషాలు ఈ ముద్దను నాననిచ్చి ఆ తర్వాత మందపాటి చపాతీల్లా చేసి మనకు నచ్చిన ఆకారంలో చిన్న ముక్కలుగా కోసుకుని బాగా కాగిన నూనెలో వేయించాలి.

జీరా బిస్కెట్లు

కావలసిన పదార్థాలు

మైదా :  అర కేజీ

గుడ్లు : నాలుగు

పొడి చేసిన పంచదార : పావు కేజీ

జీలకర్ర : ఒక టీస్పూను, ఓమ : అర టీస్పూను, 

వంటసోడా : చిటికెడు, ఉప్పు : కొద్దిగా

తయారుచేసే విధానం

ముందుగా గుడ్లు, పంచదార పొడి, జీలకర్ర, ఓమ, వంటసోడా, ఉప్పు అన్నీ కలిపి ఒక నిమిషం మిక్సీలో వేయాలి. ఈ మిశ్రమాన్ని మైదాపిండిలో కలిపి చపాతీ పిండిలా చేసుకోవాలి. ఆ ముద్దపైన మూతపెట్టి ఒక పది నిమిషాలు గాలి తగలకుండా నానబెట్టాలి. ఆ తర్వాత చతురస్రాకారంలో చిన్నముక్కలుగా కోసి వాటిపై ఫోర్క్‌తో అక్కడక్కడా గుచ్చి బాగా కాగిన నూనెలో వేయించాలి.


logo