బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 03:10:42

ఆల్కహాల్‌తో అధిక రక్తపోటు

ఆల్కహాల్‌తో అధిక రక్తపోటు

ఆల్కహాల్‌ అతిగా తీసుకుంటే లివర్‌ పాడవుతుందని మాత్రమే మొన్నటివరకు తెలుసు. ఇప్పుడు ఆల్కహాల్‌ జబ్బుల జాబితా పెరిగింది. వారంలో 8 కన్నా ఎక్కువ ఆల్కహాలిక్‌ డ్రింక్స్‌ తీసుకుంటే అధిక రక్తపోటు కూడా వచ్చిపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్లలో ఈ రిస్కు ఎక్కువగా ఉంటుందంటున్నారు. ఈ అధ్యయనానికి సంబంధించిన వివరాలు అమెరికన్‌ హార్ట్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో కూడా ప్రచురితమయ్యాయి. ఎప్పుడో ఒకసారి ఏ ఫంక్షన్‌లోనో ఆల్కహాల్‌ తీసుకుంటే ఫరవాలేదు. కానీ అతిగా తీసుకుంటే మాత్రం బీపీ ముప్పు తప్పదంటున్నారు ఈ అధ్యయనం చేసిన పరిశోధకులు. ఓ మోస్తరుగా ఆల్కహాల్‌ తీసుకునేవాళ్లలో బీపీ పెరిగే అవకాశం 79 శాతం ఉంటుంది. ఇక దాదాపు రోజూ ఆల్కహాల్‌ తీసుకునేవాళ్లలో అధిక రక్తపోటు వచ్చే ప్రమాదం 91 శాతం ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. 10 వేలకుపైగా డయాబెటిస్‌ రోగులతో అధ్యయనం నిర్వహించామని చెప్పారు వేక్‌ ఫారెస్ట్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు. అందుకే కాలేయాన్ని కాపాడుకోవడానికే కాదు, రక్తపోటు పెరగకుండా ఉండటం కోసం కూడా ఆల్కహాల్‌కి దూరంగా ఉంటే మంచిది. logo