ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 03:08:03

నిద్రలో నడిచేవాళ్లకు గుండెపోటు!

నిద్రలో నడిచేవాళ్లకు గుండెపోటు!

మంచి నిద్రలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా లేచి కూర్చుని, ఏదేదో మాట్లాడేసి మళ్లీ పడుకునేవాళ్లు కొందరు ఉంటారు. ఇకపోతే నిద్రపోతూనే మంచం మీద నుంచి లేచి అలా నడుస్తూ వెళ్లడం కూడా కొంతమందిలో చూస్తాం. సినిమాల్లో ఇలాంటి సమస్యను హాస్యం కోసం వాడుకుంటారు. కానీ ఈ అలవాటు ఒక్కోసారి ప్రమాదాన్ని తెచ్చిపెట్టవచ్చు. ఈ సమస్య చుట్టూ చాలా నమ్మకాలున్నాయి. నిద్రలో నడిచేవాళ్లను నిద్ర నుంచి లేపితే వాళ్లకు గుండెపోటు వస్తుందనీ, దీనివల్ల వాళ్లు ప్రమాదంలో పడతారనీ నిపుణులు అంటారు. అయితే ఇలా నిద్రలో నడిచేవాళ్లను నెమ్మదిగా లేపాలేగానీ, హడావుడిగా పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ, అరుస్తూ,  వేగంగా కదుపుతూ లేపకూడదు. దీనివల్ల వాళ్లు గందరగోళానికి గురవుతారు. భయంతో లేస్తారు. నిద్రలో నడిచేవాళ్లు కండ్లు మూసుకునే ఉంటారు కాబట్టి, ఇంట్లో ఉన్న వస్తువులను చూసుకోక దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అందుకే అలా నడిచే వాళ్లను  బెడ్రూమ్‌లో మంచం దగ్గరికి తీసుకువెళ్లాలి. మంచంపై పడుకోబెట్టి మృదువుగా మాట్లాడుతూ లేపాలి. ఇలా చేయడం వల్ల పదే పదే నిద్రలో నడిచే అలవాటును తగ్గించవచ్చు కూడా. ఈ అలవాటు ఉన్నవాళ్లకు సరైన చికిత్స అందించడం అవసరం. 


logo