మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Sep 27, 2020 , 01:38:19

నివేదా..హృదయ నివేదన!

నివేదా..హృదయ నివేదన!

నటిగా, మోడల్‌గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నది నివేదా పేతురాజ్‌. ఈ ముద్దుగుమ్మ తన నటనతో హావభావాలతో తమిళ, తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్నది. ‘రెడ్‌' చిత్రంలో రామ్‌ సరసన కనిపించబోతున్నదీ తమిళ సుందరి.  

    • తమిళనాడులోని కోవిల్పట్టిలో 1991 నవంబర్‌ 30న జన్మించింది నివేదా. తల్లిదండ్రులు దుబాయ్‌లో స్థిరపడటంతో..  అక్కడే పెరిగింది. అక్కడే చదువుకుంది. 2015లో మిస్‌ ఇండియా యూఏఈ అందాల పోటీలో విజేతగా నిలిచింది. నటనపై ఆసక్తితో అవకాశాలు వెతుక్కుంటూ భారత్‌ చేరుకుంది. కల నిజం చేసుకుంది. 
  • నాలుగేండ్ల క్రితం ఓ తమిళ చిత్రంతో వెండితెరకి పరిచయమైంది నివేదా పేతురాజ్‌. ‘మెంటల్‌ మదిలో’ చిత్రంతో ఆ ముద్దుగుమ్మ తెలుగువారినీ పలకరించింది. అంతేనా, యువత తన పేరే పలవరించేలా చేసుకున్నది. 
  • ‘రామ్‌లాంటి యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ హీరోతో నటించే అవకాశం రావడం నా అదృష్టం. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతాననే నమ్మకం ఉంది. హైదరాబాద్‌ నగరం కూడా నాకు భలేగా నచ్చేసింది’ అంటున్నది. 
  • నివేదా మంచి యాక్టరే కాదు. కిక్‌ బాక్సర్‌ కూడా. తనకు రెజ్లింగ్‌ తెలుసు.  ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. ఇప్పటికే తను సందర్శించిన దేశాలు చాలానే ఉన్నాయి. ప్రస్తుతం,సినిమాల్లో మంచి ప్రాజెక్టులు చేసి సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని చెబుతున్నది ఈ అందాల బొమ్మ. 
  • లాక్‌డౌన్‌ టైమ్‌లో తనలోని చిత్రకారిణిని నిద్రలేపింది నివేదా. మనసుకు నచ్చిన చిత్తరువులను దించి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకున్నది. చాలా ప్రశంసలే వచ్చాయి. 
  • కొంతకాలం తనకు చెప్పుకోదగ్గ అవకాశాలేవీ రాలేదు. అయినా ప్రయత్నాలు ఆపలేదు. ‘మెంటల్‌ మదిలో’ సినిమాలో శ్రీవిష్ణు సరసన నటించి, సిల్వర్‌ స్క్రీన్‌కు పరిచయమైంది నివేదా. చిత్రలహరి, బ్రోచేవారెవరురా, అల వైకుంఠపురంలో, రోషగాడు, టిక్‌ టిక్‌ టిక్‌.. సినిమాలతో మంచి పేరే తెచ్చుకున్నది. స్పేస్‌ ఫిక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ‘టిక్‌ టిక్‌ టిక్‌'తో ప్రేక్షకుల ప్రశంసలూ పొందింది.
    • నివేదా ప్రస్తుతం రామ్‌ సరసన ‘రెడ్‌'లో నటిస్తున్నది. తమిళంలో ‘పార్టీ’ తదితర సినిమాలతో బిజీగా ఉంది. దుబాయ్‌లోని ఓ ప్రఖ్యాత యూనివర్సిటీ నుంచి హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌లో పట్టా పొందింది.


logo