నేను మీ బెల్లీ

Sep 20, 2020 , 01:25:01

హాయ్‌ ఫ్రెండ్స్‌!  నా పేరు బెల్లీ. నన్ను డిస్నీలో మీరు చూస్తూనే ఉంటారు కదా. నా గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని వచ్చాను. నేను డిస్నీ ప్రిన్సెస్‌ని. అంటే యువరాణినన్నమాట. అలా అని నేనేదో రాజ్యంలో ఉంటాననుకోకండి. నేను కూడా మామూలు అమ్మాయినే.  నాకు చదువడం అంటే చాలా ఇష్టం. వింతైన కథలు చదువుతాను. వాటి ద్వారా నేను కొత్త ప్రదేశాలకు వెళ్లాలనుకుంటాను. ఎన్నో కథల్లో నేను కొత్త కోణాలను కనుగొనడానికి ఆసక్తి చూపిస్తాను. జీవితం సాదాసీదాగా కాకుండా కొత్తగా ఉండాలి అందుకే నేను ధైర్యం చేస్తాను. రోజూ కొత్తగా జీవించడానికి సాహసం చేస్తుంటాను.  నన్ను లిండా వూల్‌విర్‌టన్‌ తయారు చేశారు. మొదటిసారి నేను పసుపు పచ్చని గౌనులో కనిపించాను. దాంట్లోనే  ఎక్కువ అందంగా ఉంటానని అందరూ అంటారు. నేను మొట్టమొదటగా కనిపించింది 1991 ‘బ్యూటీ అండ్‌ ద బెస్ట్‌' అనే సినిమాలో. ఆ తర్వాత ఎన్నో యానిమేటెడ్‌ ప్రోగామ్స్‌లో వచ్చాను. ‘డిస్నీస్‌ హౌస్‌ ఆఫ్‌ మౌస్‌' అనే ప్రోగాంలో నేను చాలాసార్లు కనిపించాను. 1996లో డిస్నీ యానిమేటెడ్‌ ఫీచర్‌ ‘ద హంచ్‌ బ్యాక్‌ ఆఫ్‌ నోట్రి డ్యామ్‌'తో అందులోకి కూడా అడుగు పెట్టాను. ఇక అప్పటి నుంచి నాకు ఆరాధకులు పెరిగిపోయారు. వీడియో రిలీజ్‌లో కూడా నేను నటించాను. నా పేరు పెట్టుకొని చాలామంది నటించారు కూడా.  


తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD