పచ్చని గిటార్‌

Sep 20, 2020 , 01:22:05

ఈ చిత్రంలో చూడగానే మీకు గిటార్‌ కనిపిస్తుంది కదా. గిటార్‌ ఆకారంలో ఉన్న చెట్లు అవి. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 7వేల చెట్లు.  భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదా!.  అదంతా గ్రాఫిక్స్‌ ఏమీ కాదు. అర్జెంటీనా ప్రాంతంలో పెడ్రో మార్టిన్‌   అనే రైతు దీన్ని సృష్టించాడు. అతని భార్య జ్ఞాపకార్థం ఈ చెట్లను నాటాడు.  1977లో ఆయన భార్య గ్రెసీలా చనిపోయింది.  ఆమె వయసు అప్పుడు 25సంవత్సరాలు. అప్పటికి ఆమెకు అయిదుగురు పిల్లలు ఉన్నారు.  తనంటే మార్టిన్‌కు ఎంతో ప్రేమ.  ఆమె కోసం ఏమైనా చేయాలని ఆలోచించాడు. గ్రెసీలాకు గిటార్‌ అంటే చాలా ఇష్టం. దీంతో  గిటార్‌ ఆకృతిలో చెట్లను పెంచాలనుకున్నాడు.  దీని కోసం చాలామందిని సంప్రదించాడు. కానీ ఎవరూ సాయం చేయలేదు.  చివరికి తన పిల్లల సహాయంతోనే ఇంత పెద్ద పని పూర్తి చేశాడు.  పిల్లల్ని ఒక వరుసలో నిలబెట్టాడు. కొలతల ప్రకారం చెట్లను నాటి విజయం సాధించాడు. ఈ చెట్లలో సైప్రస్‌, యూకలిప్టస్‌ ఉన్నాయి. గూగుల్‌ మ్యాప్స్‌ నుంచి కూడా దీన్ని స్పష్టంగా చూడొచ్చు. 

తాజావార్తలు

ట్రెండింగ్

THE CONTENTS OF THIS SITE ARE © 2020 TELENGANA PUBLICATIONS PVT. LTD