బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Sep 20, 2020 , 00:40:15

రవ్వతో రుచిగా పాన్‌ కేక్స్‌

రవ్వతో రుచిగా పాన్‌ కేక్స్‌

కావాల్సినవి 

రవ్వ : అర కప్పు, పెరుగు : రెండు టేబుల్‌స్పూన్స్‌, క్యారెట్‌ తురుము : రెండు టేబుల్‌ స్పూన్స్‌, ఫ్రెంచ్‌ బీన్స్‌ ముక్కలు : రెండు టేబుల్‌స్పూన్స్‌, ఉల్లిపాయ ముక్కలు : ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి : 2, మిరియాల పొడి : కొద్దిగా,  నూనె : రెండు టేబుల్‌స్పూన్స్‌, 

ఉప్పు : తగినంత 

తయారీ : 

ఒక గిన్నెలో రవ్వ, పెరుగు, ఉప్పు కొన్ని నీళ్లు పోసి మరీ దోశ పిండిలా కాకుండా కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి. మరొక గిన్నెలో క్యారెట్‌ తురుము, ఫ్రెంచ్‌ బీన్స్‌ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలుపాలి. ఇప్పుడు తవ్వా పెట్టి కొద్దిగా నూనె వేసి రవ్వ మిశ్రమాన్ని చిన్న చిన్న దోశల్లా పోసుకోవాలి. పైన క్యారెట్‌ మిశ్రమాన్ని టాపింగ్‌ చేయాలి. ఇప్పుడు మంట తగ్గించి పై నుంచి కొద్దిగా నూనె పోసి రెండు వైపులా కాల్చుకోవాలి. దీనికి ఏ చట్నీ లేకుండానే అలాగే వేడిగా లాగిస్తే యమ టేస్టీగా ఉంటాయి.

రవ్వ వడలు 

కావాల్సినవి 

రవ్వ : ఒక కప్పు 

పెరుగు : ఒక కప్పు 

జీలకర్ర : ఒక టీస్పూన్‌ 

తినే సోడా : చిటికెడు 

ఉల్లిగడ్డలు :  2

అల్లం తురుము : అర టీస్పూన్‌ 

ఎండుమిర్చి :  6

నూనె, ఉప్పు : తగినంత 

తయారీ :  

ఒక గిన్నెలో రవ్వ వేసి అందులో పెరుగు కలిపి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి. దీంట్లో జీలకర్ర, ఉప్పు, తినేసోడా వేసి బాగా కలుపాలి. ఒక కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. చేతికి కొద్దిగా నీళ్లు అద్దుకొని చిన్న చిన్న వడల్లా రవ్వ మిశ్రమాన్ని ఒత్తుకొని నూనెలో వేయాలి. ఇలా చేసి గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించాలి. ఇలా అన్ని చేసి పెట్టుకోవాలి. మరో కడాయిలో కొద్దిగా నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు ,ఎండుమిర్చి, అల్లం తురుము వేసి ఐదు నిమిషాల పాటు సన్నని మంట మీద వేయించాలి. ఇది కాస్త చల్లరనిచ్చి, అందులో ఉప్పు వేసి మిక్సీ పట్టాలి. ఈ ఉల్లిపాయ చట్నీతో రవ్వ వడలు కలిపి తింటే ఆ రుచే వేరు. 


logo