మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 01:32:46

అలా పాపులర్‌ అయ్యారు!

అలా పాపులర్‌ అయ్యారు!

సినిమా చాలా మందిని పాపులర్‌ చేస్తుంది. కానీ అంతకంటే ఎక్కువ పాపులారిటీ తెచ్చిపెడుతున్నది బుల్లితెర. సీరియల్స్‌, వెబ్‌సిరీస్‌, ప్రత్యేక షోల ద్వారా అందులో నటించే వాళ్లు ప్రేక్షకుల మదిలో నిలుస్తున్నారు.  ప్రేక్షకుల నాడిని పట్టుకునేందుకు వర్ధమాన నటులతోపాటు సీనియర్లు సైతం బుల్లితెర వైపే అడుగులు వేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్‌తోపాటు వ్యక్తిగతంగానూ ప్రశంసలు అందుకుంటున్నారు.   

గుండమ్మ కథ సీరియల్‌లో మోక్ష పిల్లి అనే పాప చాలా ఫేమస్‌. ముద్దుగా, బొద్దుగా భలే ఉంటుంది. ఈ పాప ఇప్పుడు సోషల్‌మీడియాలో కూడా హల్‌చల్‌ చేస్తున్నది. గులాబీరేకులతో ఫేస్‌ప్యాక్‌ వేసుకొని ఉన్న ఫొటో పెట్టింది. దీంట్లో కూడా మన ఎక్స్‌పెక్టేషన్‌, రియాలిటీ ఎలా ఉంటుందో ఫన్నీగా ఒక ఫొటో పెట్టింది. ఆమె ఫాలోవర్స్‌ దానికి చాలా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. లైక్‌ల వర్షం కూడా కురుస్తున్నది. మోక్ష ఇలాంటి ఫొటోలే కాదు.. తన షూటింగ్‌ విశేషాలు కూడా పోస్ట్‌ చేస్తున్నది. 

‘క్వీన్‌' పాటల పూదోటలో 


వెండితెర మీద మెరిసిన హీరోయిన్లు ఇప్పుడు బుల్లితెర మీద కనిపించడం మామూలైపోయింది. క్వీన్‌ వెబ్‌సిరీస్‌ జీ తెలుగులో సీరియల్‌గా కూడా ప్రసారం అయింది. అలా బుల్లితెర మీద రమ్యకృష్ణ అడుగుపెట్టేసిందనే చెప్పొచ్చు. ఇప్పుడు జీ సరిగమపకి స్పెషల్‌ గెస్ట్‌గా విచ్చేసింది. ఈ రోజు వచ్చే ఎపిసోడ్‌లో ప్రదీప్‌తో కలిసి కాలు కదుపుతున్నది. ఆమె పాటలతో ఈ రోజు మారుమోగిపోతుంది. అంతేకాదు.. ప్రదీప్‌తో చేసే అల్లరి కచ్చితంగా చూడాల్సిందే! 

నాలుగేండ్ల వరకు 


సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసింది. టీవీలో యాంకర్‌గా పాపులర్‌ అయింది. స్టార్‌ మాలో వచ్చిన బిగ్‌బాస్‌తో మరింత ఫేమస్‌ అయింది. ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పెళ్లి గురించి మనసులో మాట బయట పెట్టింది. తాను ప్రేమ పెళ్లి చేసుకుంటానని చెప్పింది. వన్‌టైమ్‌ కమిట్‌మెంట్‌ ఉంటేనే అది లవ్‌ అంటున్నది ఈ భామ. భర్తతోనే చివరివరకు ఉండటాన్నే ప్రేమ అంటారని చెప్పింది. ప్రస్తుతం చాలా బిజీగా ఉందట ఈ అమ్మాయి. అందుకే ప్రేమ, పెళ్లి నాలుగేళ్ల తర్వాతేనంటున్నది. అంతేకాదు.. పెళ్లి తర్వాత ఫ్యామిలీ, భర్త, పిల్లలకే  జీవితాన్ని అంకితం చేయాలనుకుంటుందట శ్రీముఖి. 

ప్రేమను వెతుకుతూ


తెలుగు వెబ్‌సిరీస్‌ల్లో డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో వచ్చింది ‘నేను మీ కళ్యాణ్‌' ‘చాయ్‌బిస్కెట్‌' వెబ్‌సైట్‌గా మొదలై చివరకి వీడియోలు, వెబ్‌సిరీస్‌లు తీసే స్థాయికి ఎదిగింది. ఇందులో నుంచి వచ్చిన వెబ్‌సిరీస్‌ ఇది. సాయిధరమ్‌ తేజ్‌ స్పెషల్‌ ఎంట్రీతో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. ప్రేమను వెతుకుతూ వెళ్లే ఒక అబ్బాయి కథే ‘నేను మీ కళ్యాణ్‌'. అంతర్లీనంగా ఫ్యామిలీ డ్రామాతో సాగుతుంది. సినిమా కథకు తక్కువ కాకుండా ఈ వెబ్‌సిరీస్‌ని చేశారు. దీనికి రేటింగ్‌ పది పాయింట్లకు 7.5గా ఇచ్చారు. పాత సిరీస్‌ అయినా కూడా చూడచక్కని కథతో తప్పక ఆకట్టుకుంటున్నది. విశ్వంత్‌, శాలినీ హీరోహీరోయిన్లుగా చేశారు. 


logo