బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Sep 13, 2020 , 01:20:19

పాస్తా.. ప్రియంగా!

పాస్తా.. ప్రియంగా!

కప్‌ కేక్‌ పాస్తా 

కావాల్సినవి : 

పాస్తా : ఒక కప్పు, ఆలివ్‌ ఆయిల్‌ : ఒక టీస్పూన్‌, వెల్లుల్లి ముక్కలు : అర టీస్పూన్‌, ఉల్లిపాయ ముక్కలు : ఒక టీస్పూన్‌,

మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ : చిటికెడు, టమాటా : ఒకటి, కారం : అర టీస్సూన్‌, మిరియాల పొడి : పావు టీస్పూన్‌, టమాటా కెచప్‌ : ఒక టీస్పూన్‌, మొజిరిల్లా చీజ్‌ : అర కప్పు, మీల్‌మేకర్‌ : అర కప్పు, ఎండుమిర్చి : ఒకటి, ఉప్పు : తగినంత 

తయారీ :  

పాస్తాను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో నూనె పోసి వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు రంగు మారే వరకు వేయించాలి. ఇందులో మిక్స్‌డ్‌ హెర్బ్స్‌, టమాటా ముక్కలు, కారం, మిరియాల పొడి, టమాటా కెచప్‌ వేసి కలుపాలి. టమాటా ముక్కలు ఉడికే వరకు ఉంచాలి. ఇప్పుడు ఇందులో కొన్ని నీళ్లు పోసి మరికాసేపు ఉంచి దించేయాలి. ఒక గిన్నెలో నీళ్లను బాగా వేడి చేసి అందులో మీల్‌మేకర్‌ వేసి ఒక నిమిషం ఉంచి తీయాలి. ఇందులో నుంచి నీళ్లు లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఇప్పుడు సిలికాన్‌ మఫిన్‌ మౌల్డ్‌లను తీసుకోవాలి. దీనికి మొజిరాల్లా చీజ్‌ రాసి పాస్తాలను చివరలో నిలబెట్టాలి. మధ్యలో మీల్‌మేకర్‌ వేసి చీజ్‌, ఎండుమిర్చిని పెట్టాలి. దీన్ని నూట ఎనభై డిగ్రీల వద్ద పదిహేను నిమిషాలు బేక్‌ చేయాలి. బయటకు తీసి పై నుంచి ముందు టమాటాలతో చేసిన సాస్‌ని దీనిమీద పోసి వేడిగా ఆరగించాలి. 

పాస్తా పాయసం 


కావాల్సినవి :

పాస్తా : ఒక కప్పు, పాలు : రెండు కప్పులు, చక్కెర : ఒక కప్పు 

కుంకుమపువ్వు : కొద్దిగా, జీడిపప్పులు : పది, కిస్మిస్‌ : పది, 

యాలకుల పొడి : ఒక టీస్పూన్‌, నెయ్యి : తగినంత.

తయారీ : 

కొద్దిగా పాలల్లో కుంకుమపువ్వు వేసి పక్కన పెట్టాలి. మిగిలిన పాలను వేడి చేసి పెట్టుకోవాలి. కడాయిలో నూనె వేసి పాస్తాను వేయించాలి. దీంట్లో పాలను పోయాలి. పావుగంట పాటు పాలలోనే ఉడికించాలి. ఇందులోనే చక్కెర, కుంకుమపువ్వు పాలు పోసి బాగా కలుపాలి. ఇది ఉడుకుతున్నప్పుడే పక్కన కడాయిలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌ వేయించుకోవాలి. దీన్ని ఉడుకుతున్న పాస్తా మిశ్రమంలో వేయాలి. చివరగా యాలకుల పొడి వేసి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే.. తియ్యని పాస్తా పాయసం రెడీ!


logo