మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Sep 12, 2020 , 22:36:47

కనీసం రెండు రోజులైనా..

కనీసం రెండు రోజులైనా..

చదువుకునేటప్పుడు పాకెట్‌ మనీకోసం యాంకర్‌ అవ్వాలని చానెల్‌కి వెళ్లింది.. అనుకోని పరిస్థితుల్లో న్యూస్‌రీడర్‌ అవ్వాల్సి వచ్చింది.  అక్కడ నుంచి ఆమె ప్రయాణం సీరియల్స్‌ వైపు  మళ్లింది. ఆ కెరీర్‌కు గుడ్‌బై చెప్పి ఖాళీగా ఉండాలనుకుంది. అదే సమయంలో వెండితెర ఆహ్వానించింది. చేసిన సినిమాలు సూపర్‌హిట్‌ అవ్వడంతో  వరుస ఆఫర్లతో తమిళ ఇండ స్ట్రీని ఒక ఊపు ఊపేస్తున్నది. అన్నీ సరిగా ఉంటే ఈ సంవత్సరం.. అహం బ్రహ్మస్మి అంటూ తెలుగులోకి ఎంట్రీ అయ్యేది. మరి ఆ సినిమా హీరోయినే  ప్రియా భవాని శంకర్‌ పరిచయం ఇది.

 • బీటెక్‌ సెకండియర్‌ చదువుతున్నప్పుడే న్యూస్‌రీడర్‌గా పనిచేసింది. అప్పటికీ తనకి జనరల్‌ నాలెడ్జ్‌ చాలా తక్కువ అంటున్నది ప్రియ. 
 • చిన్నప్పటి నుంచి సీరియల్స్‌ చూసే అలవాటే లేదు. అలాంటిది సీరియల్‌లో మంచి క్యారెక్టర్స్‌తో అలరించింది. 
 • ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. దాంతో పాటు మ్యూజిక్‌ బాగా వింటానంటున్నది. 
 • దుల్కర్‌ సల్మాన్‌తో కలిసి ఒక సినిమా చేస్తున్నది ప్రియ. అయితే కరోనా కారణంగా ఆ సినిమా షూటింగ్‌ ఆగిపోయింది. 
 • సీరియల్స్‌ చేస్తున్నప్పుడు ఒత్తిడికి లోనైందట కొన్నిసార్లు రాత్రుళ్లు లేచి ఏడ్చేసేది. 
 • డైట్‌ విషయం పెద్దగా ఫాలో అవదు ప్రియ. రోజుకు గంటపాటైనా వర్కవుట్‌ చేస్తానంటున్నది. 
 • పెండ్ల్లిచూపులు తమిళ రీమేక్‌లో కనిపించనుంది ప్రియ. 
  • భారతీయుడు 2 లో కూడా ఒక ప్రముఖ పాత్రలో కనిపించనుందీ అమ్మాయి. 
  • మీడియాలో పని చేయడం కోసం చెన్నై ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం వదులుకున్నది. 
 • ఆమెకు సెల్ఫీలు తీసుకోవడం ఇష్టముండదట. కాకపోతే ఎవరైనా అభిమానులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటే ఇష్టమంటున్నదీ అమ్మడు.
 • చంద్రముఖి సినిమాల్లో జ్యోతికలా కొన్నిసార్లు ప్రవర్తించేదట. అందువల్ల సీరియల్స్‌ నుంచి బ్రేక్‌ ఇచ్చేసింది. మళ్లీ సీరియల్స్‌ మాత్రం చేయనంటున్నది. 
 • మాధవన్‌ అంటే చాలా ఇష్టమంటున్నదీ అమ్మడు. 
 • త్వరగా కోపం వచ్చేస్తుందంటున్నది ప్రియా భవాని శంకర్‌. 


logo