బుధవారం 21 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 01:29:04

చాహెల్‌ జన్మ ధన్యం!

చాహెల్‌ జన్మ ధన్యం!

బంతిని గింగిరాలు తిప్పుతూ ప్రత్యర్థులను బోల్తా కొట్టించే టీమ్‌ ఇండియా స్పిన్నర్‌ యజువేంద్ర చాహెల్‌.. ఓ ఇంతి అందానికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. ధన్యశ్రీ వర్మను పెళ్లాడబోతున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు.. నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్‌ చేశాడు. దీంతో ఇప్పుడంతా ధన్యశ్రీ గురించే చర్చ . ఆమె ఎవరు? ఆమె గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. మరి, ధన్యశ్రీ వర్మ గురించి కొన్ని సంగతులు.. 

 • 27 సెప్టెంబర్‌ 1996 న ముంబైలో జన్మించింది. తండ్రి సాగర్‌ వర్మ బిజినెస్‌మ్యాన్‌. తల్లి వర్ష వర్మ. అన్న విశాల్‌ వర్మ. 
 • ధన్యశ్రీ చిన్నప్పటి నుంచి డాక్టర్‌ అవ్వాలని కలలు కన్నది. డ్యాన్సింగ్‌ కేవలం హాబీగా నేర్చుకుంది. శిమక్‌ ధావర్‌ అనే గురువు దగ్గర పన్నెండు సంవత్సరాల నుంచి డ్యాన్స్‌ నేర్చుకుంటున్నది. ‘నన్ను నేను చూపించు కోవడానికి డ్యాన్స్‌' అంటున్నది ధన్యశ్రీ.
 • చాలా షోల్లో డ్యాన్స్‌లు కూడా చేసింది. ఈవెంట్లలో కూడా డ్యాన్స్‌ చేసేది. పెద్ద సెలెబ్రిటీల సంగీత్‌లాంటి వేడుకలకు కొరియోగ్రఫీ చేసేది. ధన్యశ్రీ ఆలోచనల ప్రకారం.. నెగెటివిటీ అనిపించినప్పుడు కాసేపు సైలెంట్‌గా ఉండాలి. లేకపోతే దాని గురించి ఆలోచించకూడదంటున్నది. రెగ్యులర్‌ వర్కవుట్‌, సమయానికి ఆహారం, నీళ్లు ఇవి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ‘తన జీవితంలో కూడా ఈ మూడు పాటిస్తా’ అంటున్నది. ధన్యశ్రీకి తొమ్మిదో తరగతి వరకు పొట్టి జుట్టు ఉండేది. అమ్మ అసలు పొడుగు పెరుగకుండా కట్‌ చేయించేదట.
 • పద్మశ్రీ డాక్టర్‌ డీవై పాటిల్‌ హాస్పిటల్‌లో ఇంటర్న్‌షిప్‌ డెంటిస్ట్‌గా కూడా పని చేసింది. డెంటిసిమో డెంటల్‌ కేర్‌ అండ్‌ స్పాలో డెంటిస్ట్‌గా ప్రాక్టీస్‌ మొదలుపెట్టింది. 
 • తనని ఫిమేల్‌ రణ్‌వీర్‌ సింగ్‌ అని పిలుస్తారంట. అంత ఎనర్జీతో ఎప్పుడూ ఉంటుందట. తండ్రి బిజినెస్‌కి హృతిక్‌ రోషన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ బ్రాండ్‌ అంబాసిడర్లుగా కొన్నిరోజులు వ్యవహరించారు. 
 • ట్రావెలింగ్‌, పాటలు వినడం, ఫొటోషూట్‌ చేయడమంటే మహా సరదా. ఈమె యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా చాలామంది సెలెబ్రిటీలు తమ సినిమా ప్రమోషన్‌లు కూడా చేశారు. కేవలం డ్యాన్స్‌ వీడియోలు కాకుండా బ్యూటీ టిప్స్‌ కూడా ఈ చానెల్‌ ద్వారా అందిస్తున్నది. 
 • ధన్యశ్రీ వర్మ అనే ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఉంది. ధన్యశ్రీ వర్మ కంపెనీ అని ఒక డ్యాన్స్‌ అకాడమీ కూడా నడుపుతున్నది. అలాగే ఫేస్‌బుక్‌లో ధన్య-ఓ-థక్యు అనే ఒక పేజీ కూడా ఉంది. 
  • ధన్య యూట్యూబ్‌ చానెల్‌కి లక్షా యాభైఐదు వేలకి పైగా సబ్‌స్ర్కైబర్లు ఉన్నారు. అన్ని వీడియోలకి కలిపి సుమారు 150 మిలియన్ల వ్యూస్‌కి పైగా ఇప్పటికి దక్కి ఉంటాయి. ఇన్‌స్టాలో రెండు లక్షల యాభై వేలకి పైగా ఫాలోవర్లు ఉన్నారు. 
  • కుక్కలంటే చాలా ఇష్టం. తన దగ్గర ఉన్న కుక్క పేరు ప్యాచ్‌. ఒకప్పుడు దుబాయ్‌లో తండ్రి ఆర్కిటెక్చర్‌గా పనిచేశారు. దీనివల్ల తరచుగా ధన్యశ్రీ దుబాయ్‌ వెళుతుండేది. logo