గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Sep 06, 2020 , 00:33:14

కరోనా గేమ్‌ బాయ్‌

కరోనా గేమ్‌ బాయ్‌

హాయ్‌ పిల్లలూ.. కరోనా కారణంగా బోలెడు సెలవులు వచ్చాయి కదా! మీరంతా  డ్రాయింగ్స్‌, డ్యాన్స్‌, సాంగ్స్‌తో బిజీబిజీగా  గడుపుతున్నారు కదా! అలాగే ఈ సెలవుల్లో చాలామంది తమ ప్రతిభను వెలికి తీశారు కూడా. చాలామంది ఎన్నో అవిష్కరణలు ఈ లాక్‌డౌన్‌ కాలంలో చేశారు. మణిపూర్‌కు చెందిన ఈ బుడతడు ఏకంగా ‘కరోనా గేమ్‌'నే సృష్టించాడు. ఇదొక కిడ్స్‌ గేమ్‌. 

మణిపూర్‌కు చెందిన  బల్దీప్‌ నింగ్‌టో జామ్‌ అందరిలాగే సెలవుల్లో ఇంట్లో ఉండేవాడు. కరోనా కారణంగా దేశమంతా లాక్‌డౌన్‌ ఎదుర్కోవడాన్ని టీవీల్లో చేసేవాడు. ఈ సమయంలోనే అతనికి ఒక ఆలోచన వచ్చింది, గేమ్‌ తయారు చేయాలని.   ‘కరోనా బోయ్‌' పేరుతో  ఈ గేమ్‌ను రూపొందించాడు. 

‘లిటిల్‌ కృష్ణ’ తరహాలో   బుల్లోణ్ని రోడ్డంట పరిగెత్తిస్తూ బోల్దంత టైమ్‌ పాస్‌  చేయొచ్చు అంటున్నాడు బల్దీప్‌ నింగ్‌టోజామ్‌. లాక్‌డౌన్‌లో చిక్కుకున్న ఆ పిల్లాడ్ని వాడి సొంత ఊరికి చేరిస్తే గేమ్‌ పూర్తి చేసినట్లే.

మణిపూర్‌లోని ఇంఫాల్‌కు చెందిన  బల్దీప్‌ ఈ మొబైల్‌ ఫోన్‌ గేమ్‌కు మంచి స్పందన వచ్చింది.  ‘COROBOI’ అని  ప్లే స్టోర్‌లో ఈ గేమ్‌ అందుబాటులో ఉంది. కరోనానుంచి తప్పించుకోవడం, బలమైన ఆహారం తీసుకోవడం, బయటకు రాకుండా ఉండటం, వచ్చినా జాగ్రత్తలు పాటించడం  ఈ గేమ్‌ సారాంశం. రోడ్డులో పరిగెడుతూ కరోనా బాల్స్‌ నుండి తప్పించుకుని దారిలో దొరికే పళ్లు అందుకుంటూ వెళ్తే పాయింట్లు వస్తాయి. పోలీసోళ్లకు చిక్కితే పాయింట్లు పోతాయి. తాను భవిష్యత్తులో మంచి పనులు చేసే ఎథికల్‌ హ్యాకర్‌ కావాలనుకుంటున్నానని బల్దీప్‌ చెబుతున్నాడు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌..ఇతర టెక్నాలజీల గురించి మరింత తెలుసుకోవాలని ఉందనీ, కొవిడ్‌లో ఆటను డెవలప్‌ చేయమని మా మామయ్య ఇచ్చిన సలహాతో ఈ గేమ్‌ ను తయారుచేశానని చెప్పాడు బల్దీప్‌ నింగ్‌టో జామ్‌.


logo