గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 30, 2020 , 00:20:39

నయా హంగామా!

 నయా హంగామా!

టీవీ చానెళ్లు.. యూట్యూబ్‌.. ఇతర ఓటీటీలలో కొత్త కంటెంట్‌ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.. నటీనటులు కూడా కొత్తగా ఉండేలా ప్రయత్నిస్తున్నారు.. అంతేకాదండోయ్‌.. కొత్త జనరేషన్‌ కూడా ఈ కొత్త ప్రపంచానికి స్వాగతం పలుకుతున్నది.. కొత్త కొత్త విశేషాలతో పాటు.. మన నటులు ఏం చేస్తున్నారు? వారి పనుల గురించి కూడా చెప్పేసేందుకు మేం సిద్ధమయ్యాం.. మరి మీరు కూడా ఈ బుల్లితెర ముచ్చట్లను చదివేందుకు రెడీ అయిపోండి.. 

మోడ్రన్‌ మహానటి

బుల్లితెర మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాకర్‌. వదినమ్మ సీరియల్‌తో ఆయన బిజీ అయిపోయాడు. స్టార్‌ మాలో వచ్చే ఇస్మార్ట్‌ జోడీ అనే ప్రొగ్రామ్‌తో ఆయన మలయజలో కూడా మంచి నటి ఉందనేది అర్థమవుతుంది. అయితే ఒక్క ఎపిసోడ్‌లో తన కూతురు, కొడుకు కూడా వచ్చారు. ఆయన కూతురు దివిజ ప్రభాకర్‌ ఇప్పుడు యూట్యూబ్‌లోకి అడుగుపెట్టింది. మోడ్రన్‌ మహానటి పేరు మీద వారానికొక ఒక ఎపిసోడ్‌ రిలీజ్‌ చేస్తుంది. తమాడా మీడియా ద్వారా ఇప్పటికే ఎపిసోడ్లు రిలీజ్‌ అయ్యాయి. మంచి వ్యూస్‌ సంపాదిస్తున్నాయి. ఇంకెందుకాలస్యం నచ్చితే మీరు బెల్‌ కొట్టేయండి. 


కృష్ణం వందే జగద్గురుమ్‌!

కృష్ణాష్టమిని ఒక్కొక్కరూ ఒక్కోలా జరుపుతుంటారు. మన టీవీ ఆర్టిస్ట్‌ అంజు అస్రానీ మాత్రం మరింత ఘనంగా చేసుకుంది. ఆ కృష్ణుడికి యాభై ఆరు రకాల వంటకాలను నైవేద్యంగా పెట్టింది. ఈ వేడుకకు తన స్నేహితురులు మరో బుల్లితెర నటి శ్రీవాణి కూడా హాజరైంది. అంతేకాదు.. తన చెల్లి ప్రీతి అస్రాని కృష్ణుడిగా మారి ఫొటోకి ఫోజు ఇచ్చింది. ఈ వేడుక గురించి సోషల్‌మీడియాలో మిగతా ఆర్టిస్టులు తాము మిస్సయ్యామని పోస్ట్‌లు పెట్టారు. మొత్తానికి అలా అంజు కఋష్ణాష్టమి పోస్ట్‌ మరింత పాపులర్‌ అయింది. లాక్‌ చేస్తుంది!

మనకు ప్రియమైన వారు దూరమవుతే తట్టుకోలేం. దాన్ని దాటుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కొందరు బయటపడుతారు. మరికొందరు సైకోగా మారే ప్రమాదమూ ఉంది. అలా మారిన ఒక డాక్టర్‌ కథే ‘లాక్డ్‌'. ఆహాలో వెబ్‌సిరీస్‌గా వచ్చింది. ఇందులో సత్యదేవ్‌ మెయిన్‌ ఎట్రాక్షన్‌. పైగా ఇది సీజన్‌ వన్‌ మాత్రమే. రెండో సిరీస్‌ కోసం వేచి చూసేలా ముగించాడు దర్శకుడు. మొత్తానికి సైకో థ్రిల్లర్‌గా అందరినీ లాక్‌ చేసేస్తుంది. ైస్టెలిష్‌గా విష్ణుప్రియ.. 

బుల్లితెర యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్నది విష్ణుప్రియ. అయితే ఈ అమ్మడు బిగ్‌బాస్‌కి వెళుతున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. కానీ, తాను ఈ షోకు వెళుతున్నట్టు కానీ, వెళ్లడం లేదని కానీ చెప్పలేదు. అయితే ఇటీవల ఆమె పోస్ట్‌ చేసిన ఫొటోకి కామెంట్ల వెల్లువెత్తాయి. పర్పుల్‌ లాంగ్‌ గౌన్‌లో ‘అలా పైకి ఎగురుతున్నా’ అంటూ కామెంట్‌ పెట్టింది. దీనికి కొందరు బుట్టబొమ్మలా ఉన్నావని కామెంట్‌ పెడితే, మరికొందరేమో బిగ్‌బాస్‌కి ముందు ఫొటోషూటా? అంటూ ప్రశ్నలు వేస్తున్నారు. ఈ విషయంపై కూడా విష్ణుప్రియ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా ఈ డ్రెస్‌తో ఇప్పటివరకు ఏ ఈవెంట్‌లోనూ కనిపించలేదు. దీంతో చాలామంది బిగ్‌బాస్‌ ప్రయత్నాలే అంటూ డిసైడ్‌ అవుతున్నారు. logo