బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Aug 16, 2020 , 00:21:52

అన్నూభాయ్‌.. పేపర్‌ చాయ్‌!

అన్నూభాయ్‌.. పేపర్‌ చాయ్‌!

చాయ్‌ ఎలా తయారుచేస్తారు? స్టీల్‌, రాగి, అల్యూమినియం గిన్నెల్లోనే కదా? కానీ అన్నూభాయ్‌ పేపర్‌లో చాయ్‌ తయారుచేస్తాడు. పేపర్లో చాయ్‌ పెట్టడమేంటి అనుకుంటున్నారా? అయితే ఇది చదవండి! 

ఆదిలాబాద్‌లోని చాంద(టి) గ్రామంలో 10 ఏండ్లనుంచి పేపర్‌లో చాయ్‌ చేస్తున్నాడు అన్నూభాయ్‌ అనే వ్యక్తి. ఈ ‘పేపర్‌ టీ’ అంటే అక్కడ అందరికీ ఇష్టమట. అన్నూభాయ్‌ గతంలో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) సమీపంలోని హోటల్‌లో పనిచేసేవాడు. వందలమంది ఉద్యోగులు, కార్మికులు ప్రతిరోజు చాయ్‌ తాగడానికి వచ్చేవారు. వారికి స్టీల్‌, అల్యూమినియం పాత్రల్లో చాయ్‌ చేసి పెట్టేవాడు. కానీ, వాటిలో చాయ్‌ అంత రుచిగా రావడం లేదని తరచూ అనేవారట. ఇలా కాదు ఏదైనా కొత్త పద్ధతిలో చాయ్‌ చేస్తే బాగుంటుంది అని పేపర్‌తో ప్రయోగాలు చేశాడు. పేపర్‌ను డొప్ప తరహాలో ముళ్లతో ఏర్పాటుచేసి చాయ్‌ తయారుచేయడం మొదలుపెట్టాడు. మొదట వేడికి పేపర్‌ కాలిపోయేది. ఆ తర్వాత నుంచి కాలిపోకుండా చాయ్‌ చేయడం ప్రారంభించాడు. సీసీఐ మూత పడిన తర్వాత బతుకు దెరువుకోసం చాందకి వచ్చాడు. అక్కడ చిన్నపాటి హోటల్‌ పెట్టుకొని వచ్చిన వారికి పేపర్‌ చాయ్‌ తాగించడం ప్రారంభించాడు. ఇది ఎంతో రుచికరంగా ఉండటంతో అన్నూభాయ్‌ పేపర్‌ చాయ్‌కి మంచి ఆదరణ లభిస్తున్నది.  బ్రాండ్‌ వాల్యూ  కూడా ఏర్పడింది. ఆ ఊరివైపు వెళ్తే ఒకసారి లుక్కేయండి! logo