ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 16, 2020 , 00:19:27

ఆనాటి ఐసొలేషన్‌ ఇల్లు!

 ఆనాటి ఐసొలేషన్‌ ఇల్లు!

కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్నది.  ఎవరికి వారు ఐసొలేషన్‌ కేంద్రాల్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు.  కానీ.. ప్లేగు వ్యాధి ప్రబలినప్పుడు ఎలాంటి ఐసొలేషన్‌ కేంద్రాలు లేవు.  మరి వాళ్లెలా ఉండేవారు? ఇదిగో ఇలా.. ఆస్తులమ్ముకొని మరీ బావులవద్ద ఐసొలేషన్‌ ఇండ్లు కట్టుకునేవారు. 

చిత్రంలో కనిపిస్తున్నది ఒక ‘జీ ప్లస్‌ వన్‌' ఐసొలేషన్‌ ఇల్లు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం గుమ్మడవెల్లి గ్రామంలో ఉంది. వందేండ్ల క్రితం హైదరాబాద్‌లో ప్లేగు మహమ్మారి ప్రబలింది. జనజీవనం అతలాకుతలం అయ్యింది. చాలామంది ప్రాణాలు కోల్పోయారు. పట్టణాల్లో ఎంతో కొంత వైద్య సహాయం అందింది. కానీ, పల్లెల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వేరే ఏదైనా ఊరికి వెళ్దామంటే అక్కడా మహమ్మారి ఉందని వ్యవసాయ బావులవద్ద తలదాచుకున్నారు. గుడిసెలు వేసుకొని నెలల తరబడి అక్కడే జీవించారు. అయితే, ఆర్థికంగా బాగున్నవారు బావుల దగ్గరే సొంతంగా ‘ఐసొలేషన్‌ ఇండ్లు’ కట్టుకొని కాలం వెల్లదీశారు. అలాంటి గ్రామాల్లో గుమ్మడవెల్లి ఒకటి. ఈ గ్రామానికి చెందిన బత్తుల కృష్ణారెడ్డి రెండువేల రూపాయలతో బావివద్ద ‘ఐసొలేషన్‌ ఇల్లు’ కట్టుకున్నాడు. అది ప్లేగు మహమ్మారికి సాక్ష్యంగా కనిపిస్తున్నది. logo