శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 16, 2020 , 00:16:50

ఉద్యమాల చౌరస్తా!

ఉద్యమాల చౌరస్తా!

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 సంవత్సరాలు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమై ఆరేండ్లు గడిచాయి. ఈ రెండు స్వాతంత్య్ర ఘట్టాల్లోనూ చైతన్య వేదికగా నిలిచింది ఓ ప్రదేశం. ఉద్యమస్ఫూర్తిని రగిలించి గాంధీ చౌరస్తాగా పేరు గాంచింది. అదే జమ్మికుంట చౌరస్తా. 

దేశ స్వాతంత్య్రం కోసం జాతిని జాగృతం చేసిన మహావ్యక్తి గాంధీ. ఆయన విగ్రహాలు ఉండని ఊరు ఉండదు. కానీ, కరీంనగర్‌ జిల్లా జమ్మికుంట పట్టణంలో ఉన్న గాంధీ విగ్రహానికి, ఆ చౌరస్తాకు ఓ ప్రత్యేకత ఉంది. సత్యాగ్రహ ఉద్యమంలో భాగంగా ఇదే ప్రదేశంలో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. స్వాతంత్య్రం రాక ముందే జమ్మికుంట మున్సిపాలిటీగా ఉండేది.  నాటి వ్యాపార, వాణిజ్య వర్గాలు ఈ చౌరస్తాలో మహాత్ముడి విగ్రహం ఏర్పాటు చేయాలని సంకల్పించారు. కోల్‌కతా శిల్పులతో విగ్రహం తయారు చేయించారు. 1949 నవంబర్‌ 3న నాటి కరీంనగర్‌ సివిల్‌ అడ్మినిస్ట్రేటర్‌ సత్యనారాయణమూర్తి ఈ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. 1950 ఫిబ్రవరి 5న నాటి హైదరాబాద్‌ ప్రధాని ఎంకే వెల్లోడి విగ్రహావిష్కరణ చేశారు. అలా ఈ చౌరస్తా ‘గాంధీ చౌక్‌'గా మారింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ  ఇక్కడి నుంచే ఉద్యమ గొంతుకను వినింపించేలా చేసింది. రాష్ట్రం వచ్చాక ‘తెలంగాణ చౌక్‌'గా రూపాంతరం చెందింది.