శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 15, 2020 , 22:57:06

ఈ వారం మీ రాశి ఫలాలు

ఈ వారం మీ రాశి ఫలాలు

మేషం

వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. మిగతా రోజులు అనుకూలం. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి అన్ని విధాలుగా సహకారం లభిస్తుంది. స్వయంగా పనులు చేస్తారు. పదిమంది అవసరానికి సహాయం చేస్తారు. ఆరోగ్యంతో ఉంటారు. సహాయం పొందుతారు. కావలసిన వస్తువులను కొంటారు. ఆర్థిక సమస్యలున్నా ఏదో రకంగా డబ్బులు అందుతాయి. ఇబ్బందులను అధిగమిస్తారు. రుణ విముక్తులవుతారు. పనిభారం ఉన్నా సమయానికి భోజనం చేస్తారు.  వ్యాయామంపై శ్రద్ధ పెడతారు. దృఢసంకల్పంతో ఉంటారు. సంప్రదాయానికి అనుకూలంగా పనులు చేస్తారు. దేవతా గురుభక్తి పెరుగుతుంది. పనిలో అంకితభావంతో ఉంటారు. పదిమంది, ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుండి అన్ని విధాలుగా సహాయ, సహకారాలు లభిస్తాయి. 

వృషభం

వారం మధ్య ఖర్చులు ఉంటాయి. కుటుంబసభ్యులతో సంతోషాన్ని పంచుకుంటారు. అన్నదమ్ములతో మంచి సంబంధాలు ఉంటాయి. పనులలో ఉత్సాహం ప్రదర్శిస్తారు. మంచివారితో పరిచయాలు పెరుగుతాయి. నలుగురిలో మంచిపేరు లభిస్తుంది. కార్యదీక్షతో పనులు చేస్తారు. ఫలితాలు అనుకూలిస్తాయి. సహనం అవసరం. ఈ వారం సోదరులు, మిత్రుల సహాయాన్ని వినియోగించుకొని పనులు పూర్తి చేస్తారు. చేసే వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రశాంత వాతావరణం ఉంటుంది. విద్యార్థులకు చదువులో కలిసివస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి. ఆచార వ్యవహారాలను పాటిస్తారు. పనిభారం ఉండవచ్చు. అందరితో బాధ్యతగా, జాగ్రత్తగా వ్యవహరించాలి. వస్త్ర, వస్తు, వాహన సౌకర్యాలు ఉంటాయి. 

మిథునం

వారం కలిసి వస్తుంది. చివరన జాగ్రత అవసరం. వృత్తి వ్యాపారాలలో బరువూబాధ్యతలతో పనిభారం ఉంటుంది. ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తారు. సకాలానికి భోజనం చేస్తారు. ఆలోచన, సమయస్ఫూర్తితో పనులు చేస్తారు. అనుకున్న పనులను సాధించడంలో పట్టుదలగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రయాణాలలో అలసట, ఖర్చులు ఉండవచ్చు. పెద్దలకు విలువ ఇస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. సమాజంలో మంచి పేరు కార్యానుకూలతకు ఉపయోగపడుతుంది. ఆలోచనలను అమలు చేస్తారు. పట్టుదలతో పనులు చేస్తారు. అదృష్టం కలిసి వస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో క్రమేపీ పురోభివృద్ధి ఉంటుంది.

కర్కాటకం

వారం ప్రారంభంలో ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలం. భార్యాపిల్లలతో సంతోషాన్ని పంచుకొంటారు. ఇంటి వాతావరణం కార్యసాఫల్యానికి అనుకూలంగా ఉంటుంది. పెద్దల సలహాలను అమలు చేస్తారు. ఉన్నత భావాలుగల వారితో పరిచయాలు పెరుగుతాయి. పనులను పట్టుదలతో సాధిస్తారు. సంప్రదాయ దైవిక కార్యక్రమాలలో శ్రద్ధతో పాల్గొంటారు. సాహిత్య సినీ కళాకారులకు మంచి అవకాశాలు ఉంటాయి. ప్రేమభావంతో ఉంటారు. తలపెట్టిన పనులు కలిసి వస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు అవసరమవుతాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. వృత్తిద్వారా వచ్చే ఆదాయం తగ్గవచ్చు. ఖర్చులు పెరుగుతాయి. 

సింహం

వారం మధ్యలో ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలం. ఆలోచనలతో పనులు చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. అవసరానికి సహాయం చేస్తారు. ఆచార వ్యవహారాలను గౌరవిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.   ఆత్మీయులు, స్నేహితులతో సామరస్యంగా ఉంటారు. వివాదాలకు దూరంగా ఉంటే చాలా పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల వ్యాపారం అనుకూలంగా ఉండవచ్చు. తలపెట్టిన పనులు సమయానికి పూర్తవుతాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఋణంగా ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. పనులలో శ్రద్ధ చూపుతారు. అదృష్టం తోడవుతుంది. విద్యార్థులకు ఉన్నత చదువులకు మంచి సమయం. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. 

కన్య

వారం సాధారణ విషయాలలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రధాన గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈవారం పనులు సహనంతో చేస్తే తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. మనస్పర్థలు ఉండవచ్చు.  ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. తద్వారా ఖర్చులు ఉంటాయి. పనులు ప్రారంభించే ముందు ఒకటికి నాలుగుసార్లు ఆలోచించడం మంచిది. స్నేహితులు, ఆత్మీయులతో చిన్నపాటి కలహాలు ఉండవచ్చు. సఖ్యంగా ఉండటానికి ప్రయత్నం అవసరం. అనవసర విషయాలలో తలదూర్చకుండా వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం కోసం ఆహార నియమాలను పాటించడం ఉత్తమం. ఉన్నంతలో సంతోషంగా ఉండే ప్రయత్నం చేస్తారు. 

తుల

వారం చివరలో ఖర్చులు ఉండవచ్చు. కొద్దిగా నియంత్రణతో మిగతా రోజులు అనుకూలం. పరిస్థితినిబట్టి నిర్ణయాలు  తీసుకొంటారు. సత్ఫలితాలను పొందుతారు. రావలసిన ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. స్నేహితులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల సహకారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. అధికారుల ప్రశంసతో ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆప్తుల  నుండి మంచి సలహాలను పొందుతారు. ఆలోచనలను కార్యరూపంలో పెడ్తారు. వాహనాలవల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. ప్రేమానురాగాలతో సంతోషంగా ఉంటారు. ఉన్నత వ్యక్తులతో పరిచయాలవల్ల కార్య సాఫల్యం. పెద్దల  అభిప్రాయాలను గౌరవిస్తారు. 

వృశ్చికం

వారం ప్రారంభంలో ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలం. హుషారుగా పనులు చేస్తారు. నిల్చిపోయిన పనులు పునఃప్రారంభం అవుతాయి. వృత్తి, వ్యాపారాలలో ఆదాయం స్థిరంగా, సంతృప్తిగా ఉంటుంది. వస్త్ర, విలువైన వస్తువులను కొంటారు. పొదుపునకు, పెట్టుబడులకు అనుకూల సమయం. రావలసిన డబ్బు సమయానికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. చదువులో రాణిస్తారు. మంచిమార్కులతో ఉత్తీర్ణులవుతారు. ఉన్నత విద్యకు అన్ని విధాలుగా  కలిసివస్తుంది. సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు స్థిరత్వం కోసం పట్టుదలతో పనిచేయాలి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. 

ధనుస్సు

వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు. జాగ్రత్త పడండి. మిగతా రోజులు సామాన్యం. గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. పనులలో ఆలస్యం జరుగుతుంది. స్థిరమైన ఆలోచనలతో పనులు చేయాలి. ప్రతి పనికి శ్రమ అవసరం కావచ్చు.  రావలసిన డబ్బు రావడంలో ఆలస్యం కలగవచ్చు. ఆదాయ మార్గాలను అన్వేషించాలి. స్థిరంగా ఉండటానికి ప్రయత్నం అవసరం. వృథా ఖర్చులు  ఉండవచ్చు, వాటి నియంత్రణ చాలా అవసరం. ఆర్థిక సర్దుబాట్లు అవసరం కావచ్చు. మంచి లక్షణాలు గలవారితో పరిచయం కలుగుతుంది. కార్యసాఫల్యత, భక్తి భావనలు పెరుగుతాయి. పెద్దల సలహాతో ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తారు. నలుగురికి సహాయం చేయడంలో సంతృప్తిని పొందుతారు. ఉల్లాసంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 

మకరం

వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు, జాగ్రత్త పడండి. బంధుమిత్రులతో సంబంధాలు మెరుగు పర్చుకోవాలి. పెద్దల సలహాలు, సంప్రదింపులతో కార్యసాఫల్యత సిద్ధిస్తుంది. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. అనుభవాలను పంచుకొంటారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు వాయిదా వేయడం మంచిది. తాత్కాలిక ఫలితాలను ఇచ్చే పనులు చేయండి. అనుకూల ఫలితాలుంటాయి. చర్చలకు దూరంగా ఉంటూ పనులపై మనసు నిలుపుతారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. నలుగురికి సహాయం చేస్తారు. వాహనాల ఖర్చులు పెరిగినా పనులు పూర్తవుతాయి. పనివారితో ఇబ్బందులు ఉండవచ్చు, జాగ్రత్త. డబ్బులు రావడంలో వివాదాలు, మనస్పర్థలు ఉంటాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం

వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు. గ్రహస్థితి అనుకూలంగా ఉంది. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటారు. ఆరోగ్యంతో సంతృపిగా ఉంటారు. భార్యాపిల్లలతో హాయిగా ఉంటారు. వృథా ఖర్చులతో ఆర్థిక సమస్యలు, పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. గృహ నిర్మాణం, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో అస్థిరత    ఉండవచ్చు. స్థిరత్వం కోసం ప్రయత్నం చేయడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం అవసరం. ఆఫీసులో అధికారులతో సహోద్యోగులతో మంచి సంబంధాలు ఉంటాయి. సామరస్యంగా ఉంటారు. ఆఫీసులో పనితనాన్ని గుర్తిస్తారు. గౌరవ  మర్యాదలు లభిస్తాయి. పనులలో సత్ఫలితాలు ఉంటాయి. కావలసిన వస్తువులను కొంటారు. అందరి సహకారం తీసుకొని పనులు పూర్తి చేస్తారు.

మీనం

వారం ప్రారంభంలో జాగ్రత్త అవసరం. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. గతంలో ఋణంగా ఇచ్చిన డబ్బు అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆదాయం పెరుగుతుంది. ఆర్థికంగా బలపడుతారు. చాలా సమస్యలు పరిష్కరించబడతాయి. సంతృప్తిగా ఉంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. చేతిలోని పనులు పూర్తి చేస్తారు. కార్య సాఫల్యానికి పెద్దల  సలహాలను తీసుకొంటారు. పనులు పూర్తవుతాయి. పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు కొంత శ్రమిస్తే సత్ఫలితాలను సాధిస్తారు. ఉద్యోగంలో స్థిరత్వం, సంతృప్తి ఉంటాయి. పెట్టుబడుల వల్ల వృత్తి వ్యాపారాలలో లాభాలు ఉంటాయి.