మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Sunday - Aug 09, 2020 , 01:00:19

గోల్డ్‌మెడలిస్ట్‌ సంజనా!

గోల్డ్‌మెడలిస్ట్‌ సంజనా!

 • సంజనా సంఘీ ఢిల్లీలో పుట్టింది. అక్కడే పెరిగింది. ఇంతియాజ్‌ అలీ దర్శకత్వం వహించిన ‘రాక్‌స్టార్‌' సినిమాలో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా కనిపించింది. ‘హిందీ మీడియం’లో ఓ చిన్న పాత్ర చేసింది. ‘దిల్‌ బెచారా’తో హీరోయిన్‌గా మారింది. 
 • తన ప్రాథమిక విద్యాభ్యాసం ఢిల్లీలోని మోడ్రన్‌ స్కూల్‌లో. లేడీ శ్రీరామ్‌ కాలేజ్‌లో జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్స్‌ ప్రధానంగా గ్రాడ్యుయేషన్‌ చేసింది. యూనివర్సిటీ గోల్డ్‌మెడలిస్ట్‌ కూడా. తనిష్క్‌, క్యాడ్‌బరీ, ఎయిర్‌సెల్‌, కోకకోలా, మింట్రా, డాబర్‌లాంటి నూటయాభై కమర్షియల్‌ యాడ్స్‌లో మెరిసింది. 
 • సంజన చాలా బిడియస్తురాలు. నలుగురిలో మాట్లాడాలన్నా బెరుకే. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషయంలో కంగనా చేసిన కామెంట్లకు మాత్రం గట్టిగానే స్పందించింది. ‘నేను ఎప్పుడు స్పందించాలో తీర్పు చెప్పడానికి మీరెవరు? నా గురించి మాట్లాడే 
 • అధికారం ఎవరికీ లేదు. రూమర్లపై క్లారిటీ ఇవ్వడం నా ఉద్యోగం కాదు’ అంటూ ఘాటుగా ట్వీట్‌ చేసింది.
 • ‘ఫాల్ట్‌ ఇన్‌ అవర్‌ స్టార్‌' అనే పుస్తకం ఆధారంగా హాలీవుడ్‌లో ఒక సినిమా వచ్చింది.  దాన్నే  బాలీవుడ్‌లో  ‘దిల్‌ బెచారా’ పేరుతో తీశారు. ఇటీవల చనిపోయిన సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ చివరి చిత్రం  ఇది. ఇందులో సంజనా సంఘీ హీరోయిన్‌. హాట్‌స్టార్‌లో రిలీజ్‌ అయిన ఈ చిత్రాన్ని చాలామంది వీక్షిస్తున్నారు. పన్లోపనిగా, హీరోయిన్‌ గురించి కూడా ఆరా తీస్తున్నారు.. 
 • ‘నేను సగం గుజరాతీని. సగం పంజాబీని. ఢోక్లా ఎంత ఇష్టమో. తందూరీ చికెన్‌ కూడా అంతే ఇష్టం’ అంటుంది సంజన. రెండు ప్రాంతాల సంస్కృతులనూ తను గౌరవిస్తుంది. ఈ అమ్మాయి కథక్‌ డ్యాన్సర్‌ కూడా. సినిమాల్లోకి రావడానికి ముందు, 
 • ఒకటికి పదిసార్లు ఆలోచించానని అంటున్నది. 

 • కాలేజ్‌ రోజుల్లోనే డ్యాన్స్‌ పర్‌ ఫార్మెన్స్‌ ఇవ్వాలనుకుంది. కానీ, స్టేజ్‌ ఎక్కిన తర్వాత కరెంట్‌ షాక్‌తో కిందపడిపోయింది. బీబీసీలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. మేక్‌ ఇన్‌ ఇండియా క్యాంపెయిన్‌లో భాగస్వామి అయ్యింది. పట్టా చేతికొచ్చాక, మూడు కంపెనీల నుంచి జాబ్‌ ఆఫర్లు వచ్చాయి. అయినా, కళల మీద మక్కువతో సినిమాలనే ఎంచుకుంది.
 • ‘నువ్వు లేవని నమ్మలేక పోతున్నాను.  ధైర్యంగా ఉండటానికి తగినంత మనోబలాన్ని ఇచ్చినందుకు దేవుడికి ధన్యవాదాలు. ఈ చీకటి మేఘాల మధ్య మేం ప్రతి నిమిషం నిన్ను తలుచుకుంటూనే ఉంటాం. నీ చెత్త జోకులకు నవ్వుతూ కూర్చుంటే  కడుపు నొప్పి వచ్చేస్తుంది. నీతో పోటీపడి చీజ్‌ ఆమ్లెట్‌, ఫుల్‌ చాయ్‌ లాగించాలని ఉంది’ అంటూ సోషల్‌ మీడియాలో భావోద్వేగపూరితమైన మెసేజ్‌ పెట్టింది. చదువు అంటే తనకు చాలా ఇష్టం. పరీక్షలు వస్తున్నాయంటే కొన్ని వారాల ముందు నుంచే   ఎంజాయ్‌మెంట్లన్నీ కట్‌. పాఠాల మీదే ధ్యాస పెట్టేది. ముందు నుంచీ లెక్కలంటే భయం. మిగతా సబ్జెక్టులతో పోలిస్తే నాలుగు రెట్ల సమయం లెక్కల కోసమే 
 • కేటాయించేది. 
 • స్కూల్‌లో ఉన్నప్పుడు ‘ఎక్స్‌లెంట్‌ పర్‌ఫార్మర్‌' అవార్డును ఎల్‌.కె.అడ్వానీ చేతుల మీదుగా అందుకొన్నది. వయాకామ్‌ మోషన్‌ పిక్చర్స్‌లో ట్రైనీగా కొన్ని రోజులు పనిచేసింది. 


logo