గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:15:19

వానలు కురిపించే.. గంప జాతర!

వానలు కురిపించే.. గంప జాతర!

వాన రాకడ మనకేం తెలుసు? కాలానికి తగ్గట్టు వానలు కురిస్తేనే ఊరు సుభిక్షంగా ఉంటుంది. ఇప్పటి వానలు చాలామట్టుకు అకాల వానలే. మనకు అవసరం వచ్చినప్పుడు కాకుండా, వాటికి తీరినప్పుడే కురుస్తున్నాయి. కానీ.. ఒక పల్లెలో గంప తీస్తే చాలు వర్షం వస్తుంది. ఆ ఊరే కోతులగిద్ద.

‘వరుణ దేవా.. కరుణించవయ్యా’ అనగానే ఆ ఊర్లో వర్షం పడుతుంది. ఆశ్చర్యంగా ఉంది కదూ? కానీ, ఇది నిజం. నిరూపితం అంటున్నారు కోతులగిద్ద ప్రజలు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉందీ ఊరు. వర్షాలు పుష్కలంగా కురిసి పాడిపంటలు బాగుండాలని జాతర నిర్వహిస్తారు. అదే, ‘గంప జాతర’. ఊర్లో ఉన్న రక్త మాశమ్మకు చేసే ప్రత్యేక జాతర ఇది. ఊరు ఊరంతా కదిలి గంప నెత్తిపై పెట్టుకొని మాశమ్మను మొక్కుతారు. అయితే, ఇది ప్రతీ సంవత్సరం జరిగే జాతర కాదు. వర్షాలు పడటం ఆలస్యమైతేనే ఈ వేడుక నిర్వహిస్తారు. ‘మమ్ములను చల్లంగా చూడు తల్లీ’ అని గంగకు మొక్కి, కృష్ణా జలాలకు నైవేద్యాలను తయారు చేస్తారు. వేపాకుతో అప్పటికప్పుడు గంపలు తయారుచేసి పూజా సామగ్రి ఆ గంపల్లో పెడతారు. బోనాలను ఎలాగైతే ఊరేగింపుగా తీసుకెళ్తామో అట్లాగే ఈ బోనాలను ఊరేగింపుగా తీసుకెళ్లి మాశమ్మ తల్లికి పూజ చేస్తారు. గంప జాతర చేసిన తర్వాత కచ్చితంగా వాన పడుతుందని కోతులగిద్ద గ్రామస్తుల నమ్మకం. logo