మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:13:27

ఈ దర్గాకు..దయ ఎక్కువ!

ఈ దర్గాకు..దయ ఎక్కువ!

వరంగల్‌ రూరల్‌ జిల్లా పర్వతగిరి మండలం అన్నారంలో హజ్రత్‌ సయ్యద్‌ యాకూబ్‌ షావళి బాబా దర్గా ఉన్నది. దీన్ని ‘అన్నారం దర్గా’ అని అంటారు. ఏ ప్రార్థనా మందిరానికి వెళ్లినా ఆర్థికంగా, ఆరోగ్యంగా బాగుండాలి అని కోరుకుంటాం కదా? అయితే అన్నారం దర్గాకు వెళ్తే సరిపోతుంది. ప్రార్థించకున్నా, కోరకున్నా అల్లా దయ చూపుతాడట. అందుకే ఈ దర్గాకు దయ ఎక్కువ అంటుంటారు స్థానికులు. ఆర్థికంగా నష్టపోయినవారు, సంతానం లేనివారు, వ్యాపారం దెబ్బతిన్నవారు, కొత్తగా వ్యాపారంలోకి అడుగు పెట్టేవారు ఇక్కడకు వస్తుంటారు. దీనికి వెయ్యేండ్ల చరిత్ర ఉందట. యాకుబ్‌ షావలీ అరబ్బు దేశం నుంచి ఇండియాకు  వచ్చి పేదలకు దానధర్మాలు చేసేవారు. సొమ్మునంతా దానం చేసి దేశాటనకు బయల్దేరి.. మార్గమధ్యంలో ఇక్కడ  సజీవ సమాధి అయ్యారట. ఆ ప్రదేశంలోనే ప్రజలు దర్గా నిర్మించి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మానసిక రుగ్మతల నుంచి బయటపడటానికి చాలామంది ఇక్కడకు వస్తుంటారు. ఎక్కడెక్కడో నయంకాని రోగాలు ఇక్కడ నయం అవుతాయన్న గట్టి నమ్మకం. కాబట్టే, ఈ దర్గాకు దయ ఎక్కువని ప్రజలు భక్తితో చెప్పుకుంటారు.logo