మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:12:16

ఇచ్చోటనే.. పోతన భోగినీ దండకం రాసెను!

ఇచ్చోటనే.. పోతన భోగినీ దండకం రాసెను!


బమ్మెర పోతన పండితపామరులను మెప్పించిన మహాకవి, సహజ కవి. సంస్కృత భాగవతాన్ని ఆంధ్రీకరించి తెలుగు భాషనూ.. తెలుగువారినీ ధన్యులను చేశాడు. ఆయన నేటి జనగామ జిల్లా బమ్మెర గ్రామంలో పుట్టాడు. భాగవతంతోపాటు వీరభద్ర విజయం, భోగినీ దండకం, నారాయణ శతకం రాశాడు. భాగవత రచనకు ముందే.. పోతన భోగినీ దండకం రాశాడు. ఇదే తెలుగులో తొలి దండకం. చాలామందికి పోతన ఇల్లు, సమాధి తెలుసు కానీ ఆయన భోగినీ దండకం రాసిన ప్రదేశం మాత్రం తెలియదు. రాచకొండను పాలించిన పద్మనాయక రాజైన సర్వజ్ఞ సింగమ నాయకుడి ఆస్థాన కవి పోతన. అక్కడే ఉండి ‘భోగినీ దండకం’ రాశాడు. శాసనాలు, అధ్యయనాలు బమ్మెర పోతన భోగినీ దండకం రాసిన ప్రదేశం రాచకొండలోనే అని స్పష్టం చేశాయి. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. చుట్టూ గుట్టలు, ప్రశాంతమైన వాతావరణంలో చరిత్రకు సాక్ష్యంగా నిలిచిందీ మండపం. స్థానికులు దీన్ని ‘భోగం దాని మంచె’ అంటారు. ఇది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ మండలం రాచకొండలో ఉన్నది. 


logo