సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Aug 09, 2020 , 00:00:28

గప్పాలు కొడుతుండు..

గప్పాలు కొడుతుండు..

అవసరం లేకపోయినా ఎక్కువగా మాట్లాడడం.. లేని దాన్ని ఉన్నట్లుగా చెప్పడాన్ని ‘గప్పాలు కొట్టడం’ అని అంటారు. సుత్తి కొట్టుడు.. డబ్బా కొట్టడం.. కూడా ఇదే అర్థాన్ని సూచిస్తాయి. కొందరు తమకు అన్నీ తెలుసుననీ, అన్ని పనులనూ తామే చేశామనీ గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వారిని ఉద్దేశించి ‘వాడు మొత్తం గప్పాలు కొడుతుండు’ అని అంటుంటారు. తమను తామే పొగిడేసుకోవడాన్ని ‘సెల్ఫ్‌ డబ్బా’గా అభివర్ణిస్తారు. లేనిది ఉన్నట్లుగా చెప్పేవారిని ‘సుత్తి గాడు’ అనీ అంటారు. జంధ్యాల సినిమాల్లో కనిపించే సుత్తి వీరభద్రరావు.. సుత్తి వేలు పాత్రలు ఈ బాపతే. అందుకే వారి ఇంటి పేర్లు పోయి.. ‘సుత్తి’ అనే స్థిరపడింది. 


logo