గురువారం 22 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 23:05:07

చెడు.. కనరాదు!

చెడు.. కనరాదు!

ఊహించని జీవితం

జీవితం మీ చేతుల్లోనే

రచన: ప్రీతీ షెనాయ్‌; 

అనువాదం: అరుణ్‌ నీల

పేజీలు: 209; వెల: 225/-

ప్రతులకు: జైకో పబ్లిషింగ్‌ హౌస్‌

నాట్యశాస్త్రంలో అష్టవిధ నాయికలది ప్రత్యేక స్థానం. మరి, సీరియల్‌ శాస్త్రంలో! కుట్రలూ కుతంత్రాలతో కలుషితమైన మెదడు ఒకరిది, ఎదుటి మనిషి ఏడిస్తే కానీ తృప్తి పడని మనసు మరొకరిది. అభంశుభం ఎరుగని చిన్నారుల్లోనూ ఆరిందాతనమే. తల్లిలాంటి వదినమ్మలోనూ క్రూరత్వమే. ఇలాంటి పాత్రలన్నింటికీ ‘అష్టావక్ర’ అని పేరు పెట్టవచ్చేమో. అదే శీర్షికన ఓ రచయిత్రి చేసే ప్రయోగాలతో సాగిపోతుందీ రచన. దుష్టిత, నీచిత, పాపిత, జిత్తు, వంచిత, మదిత, వన్నెల, పిల్లరాక్షసి.. ఈ అష్ట పాత్రలతో కాగితం సైతం కన్నీరొలికించేంత క్రూరత్వాన్ని పలికిస్తారు. వీటి గురించి చదువుతున్నప్పుడు, పెదాలు నవ్వుతున్నా, మనసు మాత్రం ఆలోచనలతో నిండిపోతుంది. నిజంగానే, ఇలాంటి కథలను చిన్నతెర మీద చూస్తూనే ఓ తరం సాగిపోతున్నది కదా అనిపిస్తుంది. నట్టింట్లో నిప్పుల కుంపటిలా మారుతున్న  ఓ తీవ్ర సమస్యను రచయిత్రి తనదైన శైలిలో వివరించారు. 

అష్టావక్ర నాయికలు

రచన: అత్తలూరి విజయలక్ష్మి

పేజీలు: 142; వెల: 120/-

ప్రతులకు:  విశాలాంధ్ర బుక్‌హౌస్‌, ఇతర ప్రధాన పుస్తక కేంద్రాలు

డిప్రెషన్‌ ఓ భస్మాసుర హస్తం. నిన్నమొన్నటి వరకూ ఆ రుగ్మత మన నెత్తినెక్కి కూర్చుందని తెలిసినా చెప్పడానికి సంకోచించేవాళ్లం. డాక్టరును సంప్రదించడానికి వెనకడుగు వేసేవాళ్లం.  డిప్రెషన్‌కు చికిత్స తీసుకోకుండానే జీవితాన్ని దాటేవాళ్లం. ఆ ప్రభావం మానవ సంబంధాల్ని దెబ్బతీసేది. కెరీర్‌ను సర్వనాశనం చేసేది. అదృష్టవశాత్తు ఇప్పుడు కుంగుబాటు గురించి బహిరంగ చర్చ జరుగుతున్నది. ఆ గండాన్ని దాటేయవచ్చనే భరోసాతో విస్తృతంగా రచనలు వస్తున్నాయి. అలాంటి ఓ నవల ఇది. ఎక్కడైనా దూసుకుపోయే తెలివి, అబ్బాయిల కళ్లను కట్టిపడేసే అందం, అనుకున్నది సాధించే చొరవ.. తదితర గుణాలు ఉన్న ఓ అమ్మాయి జీవితం మానసిక రుగ్మతతో తారుమారైపోయే నేపథ్యంతో సాగే రచన ఇది. ఆ కుంగుబాటు ఊబి నుంచి తను బయటపడిన కథ ఇది. భారతీయ ఆంగ్ల సాహిత్యంలో  ప్రీతీ షెనాయ్‌కి ఈ పుస్తకం ఓ స్థిరత్వాన్ని అందించింది. అదే ఇప్పుడు తెలుగులోకి అనువాదమైంది.

రెవెన్యూ తీరుతెన్ను

తెలుగు రాష్ర్టాల 

రెవెన్యూ వ్యవస్థ

రచయిత: ఏనుగు నరసింహారెడ్డి పుటలు: 125 వెల: 130/-

ప్రతులకు: ప్రముఖ పుస్తక కేంద్రాలు

గత కొద్ది నెలలుగా తెలుగు రాష్ర్టాలలో.. రెవెన్యూ వ్యవస్థ గురించి ఎన్నడూ లేనంత చర్చ జరుగుతున్నది. అందులో వినిపించే అనేక అభిప్రాయాలు అసంపూర్ణంగా ఉంటున్నాయి. వ్యక్తిగత అనుభవాలు, నలుగురూ అనుకుంటున్న మాటలు, తరచూ వినే వార్తల ఆధారంగానే అవి వెలువడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ పుస్తకం ఓ కరదీపికలా పనిచేస్తుంది. రెవెన్యూ అధికారుల విధులు, ఆ వ్యవస్థలోని లోటుపాట్లు, వ్యర్థ ప్రయాసలు, పారిభాషిక పదాలు.. అన్నింటినీ పరిచయం చేస్తుంది. శతాబ్దాల నాటి రెవెన్యూ చరిత్ర నుంచి ప్రస్తుత ముఖచిత్రం వరకు పాఠకుడికి విశదపరుస్తుంది. సమస్యలతో పాటు సంస్కరణలనూ సూచిస్తుంది. ఈ రంగంలో సుదీర్ఘానుభవం ఉన్న రచయిత, తన ఎరుకను పాఠకుడితో పంచుకునే ప్రయత్నం చేయడం ముదావహం. జానెడు భూమి ఉన్న ప్రతి ఒక్కరూ కొని చదువుకోవాల్సిన పుస్తకం ఇది. సంక్లిష్టమైన విషయాన్ని సరళంగా చెప్పినందుకు రచయితను అభినందించాలి. 


logo