బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 22:53:23

ఆలూతో కరకరగా..

ఆలూతో కరకరగా..

ఆలూ స్మైలీ 

కావాల్సినవి : 

ఆలుగడ్డలు : 2; మిరియాల పొడి : అర టీస్పూన్‌ 

మిక్స్‌డ్‌ హెర్బ్స్‌ : 3/4 టీస్పూన్‌, కార్న్‌ఫ్లోర్‌ : ఒక టేబుల్‌స్పూన్‌, చీజ్‌ : ఒక టేబుల్‌స్పూన్‌, ఉప్పు, నూనె : తగినంత 

తయారీ :  ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీయాలి. ఆ తర్వాత దీన్ని తురిమి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో తురిమిన ఆలూ, మిరియాల పొడి, మిక్స్‌డ్‌ హెర్బ్స్‌, ఉప్పు వేసి బాగా కలుపాలి. ఇందులోనే కార్న్‌ఫ్లోర్‌ కూడా వేసి ఉండలు కట్టకుండా కలిపేయాలి. దీన్ని చిన్న ఉండలుగా చేసి గారెల్లా ఒత్తుకోవాలి. దీనికి స్ట్రాతో కండ్లను, స్పూన్‌తో స్మైలీ వచ్చేలా చేయాలి. ఇలా అన్నిటినీ చేసి ఫ్రిజ్‌లో పావుగంట పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి వేడి చేసుకొని ఫ్రిజ్‌లో నుంచి ఆలూ స్మైలీలను తీసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. టమాటా కెచప్‌తో తింటే యమ టేస్టీగా ఉంటాయి. 

ఆలూ వడ 

కావాల్సినవి : 


ఆలుగడ్డలు : రెండు, ధనియాల పొడి : ఒక టీస్పూన్‌, కొత్తిమీర : చిన్న కట్ట, కారం : ఒక టీస్పూన్‌, ఉల్లిగడ్డ : ఒకటి, పచ్చిమిర్చి : మూడు, ప్యాలాల పొడి : అర కప్పు, పాలు : మూడు టేబుల్‌ స్పూన్స్‌, శనగపిండి : తగినంత, బ్రెడ్‌ క్రంబ్స్‌ : అర కప్పు, అల్లం తురుము : ఒక టీస్పూన్‌, నూనె, ఉప్పు : తగినంత

తయారీ :  ఆలుగడ్డలను ఉడికించి పొట్టు తీయాలి. అలాగే తురుముకోవాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లం తురుము, ధనియాల పొడి, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, శనగపిండి, ప్యాలాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని చిన్నచిన్న వడలు చేసుకోవాలి. వీటిని పాలల్లో ముంచి, ఆ తర్వాత బ్రెడ్‌క్రంబ్స్‌లో ముంచాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఈ వడలను డీప్‌ ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీ వడలు తయార్‌! 

సంజయ్‌ తుమ్మ, సెలబ్రిటీ షెఫ్‌


logo