సోమవారం 19 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 23:59:19

ఉప్పు బస్తా నీట ముంచినట్టు..

ఉప్పు బస్తా నీట ముంచినట్టు..

పనిని తప్పించుకునేందుకు వంకరదారులు వెతికే వారిని ఉద్దేశించి ఈ సామెతను చెప్పారు. కొందరు పనిపై శ్రద్ధ పెట్టరు. దాని నుంచి ఎలా తప్పించుకోవాలా..? అని చూస్తుంటారు. తమపై ఎక్కువ భారం పడకుండా మాయోపాయాలు పన్నుతుంటారు. అలాంటి వారిని ‘అరేయ్‌.. ఉప్పు బత్తా నీళ్లల్లేసినట్టు చేయకు’ అని వారిస్తుంటారు. ఈ సామెత పుట్టుక వెనక ఒక కథ ఉన్నది. గతంలో ఓ ఉప్పు వ్యాపారి తన గాడిదపై ఉప్పు బస్తాలను వేసుకొని వేరే ఊరికి ప్రయాణమవుతాడు. ఈ క్రమంలో ఓ కాలువను దాటుతుండగా, గాడిద అందులో పడిపోతుంది. ఆ వ్యాపారి గాడిదను, బస్తాలను లేపి మళ్లీ ప్రయాణం కొనసాగిస్తాడు. బస్తాలు నీళ్లలో డవడంతో ఉప్పు కరిగిపోయి.. గాడిదకు బరువు తగ్గింది. దీంతో ఆ గాడిద.. ఎక్కడ కాలువ దాటాల్సి వచ్చినా కావాలనే అందులో పడిపోయేది. దీన్ని గుర్తించిన ఆ వ్యాపారి, గాడిదకు బుద్ధి చెప్పాలని అనుకున్నాడు. ఈసారి పత్తి బస్తాలను గాడిదపై ఉంచి వేరే ఊరికి వెళ్తాడు. గాడిద బరువు తగ్గించుకోవాలని కావాలనే కాలువలో పడిపోతుంది. వర్తకుడు పత్తి బస్తాలతోపాటు గాడిదను కూడా లేపి తిరిగి ప్రయాణమవుతాడు. కానీ, ఈసారి నీళ్లలో తడిసిన పత్తి బస్తా బరువు భారీగా పెరుగుతుంది. అప్పుడు గాడిద తాను చేసిన పొరబాటును గుర్తిస్తుంది. ఈ కథను ఆధారంగా చేసుకొని.. ఎవరైనా పనిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పై సామెతను వాడుతుంటారు. 


logo