శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Aug 08, 2020 , 23:15:46

కొత్త గ్లామర్‌ లోకం..

కొత్త గ్లామర్‌ లోకం..

సీరియల్‌ అంటే రోజూ కొత్తదనం ఉండాలి. ఒక సీరియల్‌లో ఉన్నట్టు మరో సీరియల్‌లో కనిపించ కూడదు.. మొత్తానికి, ఏదో మ్యాజిక్‌ చేస్తేనే బుల్లితెర మీద నాలుగు కాలాలపాటూ కనిపిస్తారు. ఈ సూత్రాన్ని కొందరు తు.చ. తప్పక పాటిస్తారు. చిన్నతెర మీద నిత్యం వెలిగిపోతూ ఉంటారు. ఇక, వెబ్‌సిరీస్‌ల వైపు బాగా మొగ్గుచూపుతున్నారు నవతరం ప్రేక్షకులు. అందుకే పెద్ద నటులు కూడా వీటిపై దృష్టి పెడుతున్నారు. ఇలా, సీరియల్స్‌.. వెబ్‌సిరీస్‌ల ముచ్చట్లూ..

పచ్చ బొట్టేసినా.. 

హీరోల మీద అమ్మాయిలకు క్రష్‌ ఉండటం మామూలే. ఆ ప్రేమను ఎప్పుడో అప్పుడు, ఏదో ఒకలా బయటపెడుతూనే ఉంటారు. అయితే, సాక్షాత్తు సెలబ్రిటీ అమ్మాయిలే అలా బయటపెడితే ఎలా ఉంటుంది? బుల్లితెర నాటీ యాంకర్‌గా పేరుతెచ్చుకున్న విష్ణుప్రియ తాను టాలీవుడ్‌ జూ. మన్మథుడు అఖిల్‌ని పిచ్చిగా ప్రేమిస్తున్నట్టు ఒక ప్రోగ్రామ్‌లో వెల్లడించింది. ఝాన్సీ స్టార్‌ మాలో ‘లవ్యూ జిందగీ’ పేరుతో ఒక షో చేస్తున్నది. ఇందులో శ్రీముఖి, విష్ణుప్రియ గెస్ట్‌లుగా వచ్చారు. అయితే ఆ షోలో విష్ణుప్రియ తన చేతి మీద ఉన్న ‘ఎ’ అనే పచ్చబొట్టును చూపించింది. “దేవుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటే, అఖిల్‌ అక్కినేనితో పెండ్లి చేయమని అడుగుతుంది తను” అని తన కో-యాంకర్‌ శ్రీముఖి చెప్పింది. వెంటనే ‘హా.. ఆ పేరులోనే ఓ మత్తుంది, ఒక పవర్‌ ఉంది.. వైబ్రేషన్‌ ఉంది’ అంటూ విష్ణుప్రియ కూడా మెలికలు తిరగడం ఈ షోలో కొసమెరుపు. ఈ విషయం ఇప్పుడు టీవీ ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

 స్ఫూర్తి కోసం..

తెలుగు వెబ్‌సిరీస్‌లకు నటుల కొరత చాలా ఉంది. అందుకే టాలీవుడ్‌ తారలు కూడా ఇప్పుడు వెబ్‌సిరీస్‌ల వైపు దృష్టి పెడుతున్నారు. అలాంటి ఓ మంచి కాంబినేషనే ‘లూసర్‌'. ‘ఓటమి అనేది ఎప్పుడూ గెలుపునకు నాంది అవుతుంది’ అన్నది ఇతివృత్తం. దీన్ని ఓటీటీలో విడుదల చేసింది జీ 5. ప్రియదర్శి, శశాంక్‌, కల్పికా గణేష్‌, పావని, అన్నీ.. ఇలా చాలామంది టాలీవుడ్‌ నటులు ఈ సిరీస్‌లో మెరిశారు. మూడు విభిన్న కథలు.. ఆటల నేపథ్యంలో కథ సాగుతుంది. మూడునాలుగు దశాబ్దాల నాటి.. ఆలోచనలకు, పరిస్థితులకు తగ్గట్టుగా నటీనటుల వేషభాషలు ఉంటాయి. మొత్తానికి ఒక మంచి కథను ఎంచుకుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ వెబ్‌సిరీస్‌ నిరూపించింది. ఇంకా చూడకపోతే, ఒకసారి ఈ సిరీస్‌పై ఓ లుక్కేయండి. 

చిన్న తెర 

ఇదీ ముఖ్యమే.. 

స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా పూట గడవటం లేదు. సోషల్‌మీడియా, ఆన్‌లైన్‌ గేమ్‌లు, వీడియోలు, షాపింగ్‌లు.. ఇలా అన్నీ ఆన్‌లైన్‌లోనే. అయితే వీటివల్ల లాభం ఎంతో.. నష్టమూ అంతే. చాలామంది ఆన్‌లైన్‌ మోసాల బారినపడుతున్నారు. మరికొంతమంది ఫొటోల మార్ఫింగ్‌కు బలి అవుతున్నారు. ఎక్కువగా ఈ సమస్యలను మహిళలే ఎదుర్కొంటున్నారు. వీటిపట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ విభాగం యాంకర్‌ సుమతో ప్రచారం చేయిస్తున్నది. ఈ అవేర్‌నెస్‌ కార్యక్రమంలో భాగంగా సుమ.. ‘ యువత ఎక్కువ సమయం ఆన్‌లైన్‌లోనే ఉంటున్నది. మరి సైబర్‌ సేఫ్టీ సంగతేమిటి? అందుకే ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌ పేరుతో తెలంగాణ పోలీసులు చైతన్యం కలిగిస్తున్నారు. మహిళలు, పిల్లల భద్రత కోసం #CybHERకి నేను సైన్‌ ఇన్‌ అయ్యాను మరి మీరూ..’ అంటూ ఇన్‌స్టాలో వీడియో విడుదల చేసింది. మంచి ప్రయత్నమే.

హిట్లర్‌గా వచ్చేస్తున్నాడు!

నిరుపమ్‌ పరిటాల.. బుల్లితెర సూపర్‌స్టార్‌గా వెలిగిపోతున్నాడు. తాజాగా, హిట్లర్‌గా ప్రేక్షకులకు మరింత చేరువకానున్నాడు. జీ తెలుగులో ఇప్పటికే ‘ప్రేమ’, ‘మూగమనసులు’ సీరియల్స్‌తో మహిళా ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు నిరుపమ్‌. ఇప్పుడు, ‘హిట్లర్‌ గారి పెళ్లాం’ పేరుతో తన సోషల్‌మీడియా అకౌంట్స్‌లో ప్రోమోని విడుదల చేశాడు. ఇది తెగ వైరల్‌ అవుతున్నది. పైగా పేరుకు తగ్గట్టుగానే ైస్టెలిష్‌ లుక్‌తో నిరుపమ్‌ కనిపించనున్నట్టు  దాన్ని చూస్తేనే అర్థం అవుతున్నది. మెలిపెట్టిన మీసం, సూటూ బూటుతో డాక్టర్‌బాబును మరిపించి, హిట్లర్‌ బాబు అని పిలిపించుకునేలా ఉన్నాడు. ఇందులో హీరోయిన్‌గా తమిళ సీరియల్‌ నటి గోమతి అందరినీ ఆకట్టుకోనున్నది. సీరియల్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. 


logo