ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 23:04:01

శివగంగకు.. ఛత్రపతి ఫిదా!

శివగంగకు.. ఛత్రపతి ఫిదా!

ఆలయం అనగానే ఆధ్యాత్మిక క్షేత్రమే అనుకుంటాం కదా? కానీ శివగంగను చూస్తే వాస్తు.. శిల్పకళా నిలయంలా అనిపిస్తుంది. ఇది హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో శ్రీశైలం రహదారి పక్కన మహేశ్వరంలో ఉంది. పద్మాకార నిర్మాణం కనిపిస్తుంది. ఆ పద్మాలలో హరిహరేశ్వరుడు, మల్లీశ్వరుడు, అవిముక్తేశ్వరుడు, అఘోరేశ్వరుడు, అమరేశ్వరుడు, అమృతేశ్వరుడు, గంగాధరేశ్వరుడు, ఇష్టకామేశ్వరుడు, ముక్తేశ్వరుడు, కాళహస్తీశ్వరుడు,  ఏకాంబరేశ్వరుడు, మణికర్ణికేశ్వరుడు, మహానందీశ్వరుడు, అమరావతీశ్వరుడు,  కాశీపతీశ్వరుడు, మంగళగౌరీశ్వరుడు.. పది పద్మ రేకుల్లా ఉంటారు. సహజంగా శివుని తలపై గంగ ఉంటుంది. ఇక్కడ మాత్రం గంగలోనే శివుడు ఉంటాడు.  ఇంతటి వైభవం ఉన్న శివగంగకు పెద్దగా ప్రాచుర్యం  లేదు. తానీషా దగ్గర పనిచేసిన అక్కన్న.. మాదన్నలకు ఈ ఆలయం అంటే మహా గురి. ఛత్రపతి శివాజీకి కూడా ఈ ఆలయం పట్ల ప్రత్యేక భక్తి ఉండేదట. 1677లో శివగంగను శివాజీ దర్శించుకున్నాడు. శ్రీశైలం వెళ్లిన ప్రతీసారి ఛత్రపతి ఈ పద్మాకార ఆలయం దగ్గర చాలాసేపు సేద తీరేవారట. 


logo