శనివారం 24 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 21:50:44

లడ్డు కావాలా..?!

లడ్డు కావాలా..?!

హ్యాపీ రాఖీ..  అన్నకో.. తమ్ముడికో రాఖీ కట్టడానికి వెళుతున్నారా.. ఒక రక్షాబంధన్‌ కడితే సరిపోదు కదా! మిఠాయి మాటేమిటి? నోరు తీపి చేయడానికి బయట నుంచి తీసుకెళ్లే వీలు లేదు.. కాబట్టి, తియ్యని వేడుక ఈసారి స్వహస్తాలతో వండిన లడ్డూలతో చేసుకోండి. 

సాబుదానా లడ్డు 

 • కావాల్సినవి :
 • సాబుదానా : ఒక కప్పు 
 • చక్కెర పొడి : ఒక కప్పు 
 • నెయ్యి : 3 టేబుల్‌స్పూన్స్‌
 • బాదంపప్పులు : 10
 • మినుపపప్పు : ఒక టేబుల్‌స్పూన్‌ 
 • జీడిపప్పులు : 5

తయారీ : 

కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి బాదం, మినుపపప్పు వేసి సన్నని మంట మీద వేయించాలి. ఇవి కాస్త వేగాక.. జీడిపప్పులు, సాబుదానా వేసి వేగనివ్వాలి. దీన్ని కాస్త చల్లారనిచ్చి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీంట్లో చక్కెర పొడి వేసి కలుపాలి. ఆ తర్వాత నెయ్యిని కాస్త వేడి చేసి ఇందులో పోయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. తియ్యని లడ్డూలు మీ ముందుంటాయి. కావాలనుకుంటే పై నుంచి బాదంలను సన్నగా కట్‌ చేసి గార్నిష్‌ చేస్తే మరింత బాగుంటాయి. 

పోహా లడ్డు 

 • కావాల్సినవి : 
 • అటుకులు : ఒక కప్పు
 • పల్లీలు : అర కప్పు
 • నెయ్యి : ఒక టీస్పూన్‌ 
 • అత్తిపండు : అర కప్పు 
 • ఖర్జూర : అర కప్పు
 • కొబ్బరి తురుము : 
 • ఒక టేబుల్‌స్పూన్‌ 
 • కోవా : ఒక టేబుల్‌స్పూన్‌ 
 • పాలు :  2 టేబుల్‌స్పూన్స్‌ 

తయారీ : 

కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి అటుకులను సన్నని మంట మీద రెండు నిమిషాల పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. మరో కడాయిలో పల్లీలను వేయించాలి. అత్తిపండు, ఖర్జూర, కొబ్బరితురుము, వేయించుకున్న పల్లీలను వేసి మెత్తగా మిక్సీ పట్టాలి. ఇందులోనే వేయించిన అటుకలను వేసి మరొకసారి మెత్తగా అయ్యేలా గ్రైండ్‌ చేయాలి. ఇందులో కోవా, పాలు పోసి కలుపాలి. ఆ తర్వాత చేతికి కాస్త నెయ్యి రాసుకొని చిన్న చిన్న లడ్డులను చేసుకోవాలి. రుచికరమైన లడ్డులు మీ ముందుంటాయి. 


logo