శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 21:41:37

ఈ వారం మీ రాశి ఫ‌లాలు

ఈ వారం మీ రాశి ఫ‌లాలు

మేషం

ఈ వారం కలిసి వస్తుంది. చివరలో కొన్ని ఖర్చులు ఉండవచ్చు. కుటుంబసభ్యులు అన్ని విధాలుగా సహకరిస్తారు. అవసరాలకు తగిన వస్తువులను కొంటారు. సంతృప్తిగా, ఆరోగ్యకరంగా ఉంటారు. ఆహార నియమాలను పాటిస్తారు. యోగ, వ్యాయామాల ద్వారా శారీరక పుష్టిని పెంచుకొంటారు. ఆధ్యాత్మిక ప్రవచనాలు వినడం ద్వారా ప్రశాంతతను పొందుతారు. భక్తి భావనలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమయానికి భోజనం చేస్తారు. డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరగవచ్చు. స్నేహపూర్వకంగా ఉంటారు. స్వశక్తితో పనులు చేస్తారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకొంటారు. నైపుణ్యానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఆలోచించి పనులు చేసి మంచి ఫలితాలను పొందుతారు. 


వృషభం

వారం ప్రారంభంలో ఆహార విషయంలో జాగ్రత్త అవసరం. కాలం క్రమేపీ కలిసి వస్తుంది. సోదరవర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి. సంతృప్తిగా, ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇతరులతో పోటీ పడి కార్యాలను సాధించుకొంటారు. పట్టుదల, నేర్పుతో పనులు పూర్తి చేస్తారు. మంచి ఫలితాలను పొందుతారు. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటూ కార్య సాఫల్యానికి, వ్యాపారాభివృద్ధికి పాటుపడతారు. ఇంట్లో ప్రశాంతతవల్ల బయటి పనులలో పురోగతిని సాధిస్తారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కళలు, ధార్మిక కార్యక్రమాలలో అనుకూలత ఉంటుంది. పనిభారమున్నా సమయానికి రుచికరమైన భోజనం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. 


మిథునం

వారం మధ్యలో ఆహార విషయంలో జాగ్రత్త్త అవసరం. ఆరోగ్యంతో పుష్టిగా ఉంటారు. పనిభారం ఉన్నా యుక్తి, ఉత్సాహంతో పనులు చేస్తారు. అనుకున్న పనులు పూర్తవుతాయి. సకాలంలో భోజనం చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలవల్ల ప్రయాస, ఖర్చులు ఉండవచ్చు. వీలైతే ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. పెద్దల మాటలకు విలువ ఇస్తారు. కుటుంబ వ్యక్తులపట్ల శ్రద్ధ చూపుతారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ఆలోచనలను కార్యరూపంలో పెట్టాలి. దీక్షతో పనులు చేయడం వల్ల అదృష్టం కూడా వరిస్తుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది.


కర్కాటకం

తాత్కాలిక ప్రయోజనాలతో అనుకూలంగా ఉంటుంది. వారం చివరన ఆహారం విషయమై జాగ్రత్త అవసరం. పిల్లలతో సంతోషంగా ఉంటారు. అన్ని విధాలుగా గృహవాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. మనోభావాలకు కార్యరూపం ఇస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. లక్ష్యాలు సాధిస్తారు. వారం సుఖంగా సాగుతుంది. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల శ్రద్ధ చూపుతారు. సంగీత సాహిత్య సినీ కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందరూ ఆప్యాయతతో ఉంటారు. స్త్రీలు తలపెట్టిన పనులు కలిసి వస్తాయి. గతంలో అవసరానికి రుణంగా ఇచ్చిన డబ్బు చేతికి వస్తుంది. కొంత ఆలస్యం కావచ్చు.

సింహం

వారం చివరలో జాగ్రత్త. పనులలో ఉత్సాహం కనబరుస్తారు. అవసరమైన వారికి సహాయం చేస్తారు. పురాణ శ్రవణం, ఇతిహాసాలపై మనసు నిలుపుతారు. భక్తి భావనలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండాలి. రియల్‌ ఎస్టేట్‌, ఆటోమొబైల్‌ వర్తకాలలో ఇబ్బందులు ఉన్నా పనులు సకాలంలో పూర్తయి, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. వృత్తిపరంగా, వ్యాపారంలో పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. శ్రద్ధతో పనులు చేస్తూ, శ్రమిస్తారు. తోడుగా అదృష్టం కలిసివస్తుంది. విద్యార్థులకు అన్ని విధాలుగా అనుకూల సమయం. పై చదువులకు మార్గం సుగమమవుతుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి.


కన్య

వారం ప్రారంభంలో ఇంట్లో మనస్పర్ధలు ఉండవచ్చు. ధార్మిక కార్యక్రమాలకు ఖర్చులు ఉంటాయి. పనులు ఆలోచించి చేస్తారు. స్నేహితులు, బంధువులతో సఖ్యంగా ఉండాలి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం కోసం ఆహార నియమాలను పాటించడం అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనిద్వారా శక్తియుక్తులను నిరూపించుకొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. ఆస్తుల విషయంలో తగాదాలకు తాత్కాలిక పరిష్కారం లభిస్తుంది. పనులు సమయానికి పూర్తి చేయడానికి శ్రమించాలి. రాజకీయ కోర్టు వ్యవహారాలు కలిసివస్తాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. సమయానికి భోజనం చేస్తారు. ఖర్చులు పెరుగుతాయి. రాబడి అనుకున్నంతగా ఉండక పోవచ్చు. 


తుల

వారం మధ్యలో ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకొంటారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. వారసత్వంగా రావలసిన ఆస్తుల తాలూకు వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. స్నేహితులు, ఆత్మీయుల సహకారంతో చాలా పనులు నెరవేరుతాయి. వృత్తి సంతృప్తిగా ఉంటుంది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. అనుభవజ్ఞ్ఞుల నుండి విలువైన సలహాలు పొందుతారు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. కుటుంబసభ్యుల మధ్య ప్రేమానురాగాలు వుంటాయి. గొప్పవారితో పరిచయాలవల్ల కార్యాలు సాఫల్యమవుతాయి. అందరి అభిప్రాయాలకు విలువ ఇస్తారు. అధికారులు, సహోద్యోగులు అనుకూలంగా ఉంటారు. రాజకీయ కార్యక్రమాలు ఫలవంతంగా ఉంటాయి. 

వృశ్చికం

వారం కలిసి వస్తుంది. చివరన ఖర్చులు ఉండవచ్చు. ఉత్సాహంతో, ఆనందంతో కాలం గడుస్తుంది. చాలా రోజులనుండి నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. వృత్తిలో పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. వస్తువులను కొంటారు. పొదుపు చేస్తారు. రావలిసిన డబ్బు వస్తుంది. చదువులో శ్రద్ధ కనపరుస్తారు. చదువులో పురోభివృద్ధి ఉంటుంది. అనుకూల ఫలితాలను పొందుతారు. ఉన్నత విద్యకు అనుకూలం. ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. ఆలోచనలతో కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేయడానికి కష్టపడతారు. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు ఉంటాయి. రాజకీయ, కోర్టు పనులలో ఖర్చులు, ఆలస్యం తప్పక పోవచ్చు.


ధనుస్సు

వారం చివరన జాగ్రత్తగా ఉండండి. మిగతా రోజులు సాధారణ పనులకు అనుకూలం. ప్రధాన గ్రహాల స్థితివల్ల పనులలో  ఆలస్యం కావచ్చు, ఆలోచించి చేయాలి. ద్విగుణీకృత శ్రమ అవసరం. రాబడి ఉంటుంది. వృథా ఖర్చులవల్ల సొమ్ము   నిలువక పోవచ్చు. ఆర్థిక సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. మంచి వారి పరిచయం  వల్ల కొన్ని పనులు నెరవేరుతాయి. దేవతా గురుభక్తి పెరుగుతుంది. దైవచింతనతో ప్రతికూలతలను అధిగమిస్తారు. ఆధ్యాత్మిక జీవితంతో ప్రశాంతంగా ఉంటారు. తొందరపాటు విడనాడి ఓపికతో పనులు చేయండి. ఇతరులపై ఆధార పడకుండా స్వయంగా పనులు చేసుకోండి, మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి పనిని నిశితంగా ఆలోచించి చేయాలి. 

మకరం

వారం ప్రారంభంలో ఖర్చులు ఉంటాయి. మిగతా రోజులు అనుకూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో సామరస్యంగా ఉంటారు. కార్యసాఫల్యత ఉంటుంది. పనులలో నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. చిన్న పెట్టుబడులు అనుకూలిస్తాయి. పెద్ద మొత్తంలో చేసే పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. సమాజంలో మంచి వ్యక్తులతో పరిచయాలు, బంధువర్గానికి ఆర్థిక సహాయం చేస్తారు. బంధువులు, స్నేహితులతో సంబంధాలు బాగుంటాయి. కలిసి సంయుక్తంగా పనులు చేస్తారు. అందరితో స్నేహంగా ఉంటారు. సలహాలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యంతో  హుషారుగా ఉంటారు. ఆఫీసులో సన్నిహితంగా ఉండేవారితో జాగ్రత్తగా ఉండండి. పనులలో క్రమశిక్షణ, శ్రద్ధ అవసరం. 


కుంభం

అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. గృహ నిర్మాణ పనులు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలకు మంచి సమయం. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. గ్రహస్థితి వ్యాపార విస్తరణకు అనుకూలంగా ఉన్నది. పరిస్థితులనుబట్టి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో స్థిరత్వం ఉంటుంది. ఆఫీసులో అధికారులతో మంచి సంబంధాలు. తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు లభిస్తాయి. నలుగురిలో గౌరవం పొందుతారు. ఆఫీసులో మంచి పేరు లభిస్తుంది. పనులలో మంచి ఫలితాలు ఉంటాయి. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. పొదుపునకు అనుకూలమైన సమయం. తలపెట్టిన కార్యాలు ఆటంకం లేకుండా పూర్తవుతాయి. సమయం అనుకూలిస్తుంది. ఆప్తులకు సహాయం  చేస్తారు. 


మీనం

వారం కలిసి వస్తుంది. రావలసిన డబ్బు వస్తుంది. వృత్తి వ్యాపారాలవల్ల ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి  సంతృప్తిగా ఉంటుంది. కొత్త పనుల గురించిన ఆలోచనలు చేస్తారు. పనులలో పురోభివృద్ధి ఉంటుంది. పెద్దల సలహాలను   పాటించడంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. గత పెట్టుబడుల వల్ల ఆదాయం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చదువుపై శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో సంతృప్తి, స్థిరత్వం ఉంటాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. మిత్రులతోఅభిప్రాయ భేదాలు ఉండవచ్చు. సంతృప్తిగా, ఆరోగ్యంగా ఉంటారు. సంగీత సాహిత్యాలపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగంలో పదోన్నతులు ఉండవచ్చు.