ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 20:39:25

డబ్బు సంపాదించడం ఎలా?

డబ్బు సంపాదించడం ఎలా?

డబ్బు సంపాదించాలంటే, ముందుగా డబ్బును అర్థం చేసుకోవాలి. డబ్బు కోసం తెలివిగా పనిచేయాలి. మన కోసం డబ్బు మాత్రం కష్టపడి పనిచేయాలి. ఆ చిట్కా తెలియాలంటే, ‘డై పూర్‌ ఆర్‌ లివ్‌ రిచ్‌' పుస్తకాన్ని చదవాలి. రచయిత సందీప్‌ పుల్‌జలే ఇందులో అనేక ఆర్థిక విజయ సూత్రాల్ని బోధించారు.  

‘ప్రపంచంలోని అత్యంత సంపన్నుడి దగ్గర.. ప్రపంచంలోని అత్యంత సంపన్న సంస్థకు చెందిన షేర్లు ఉండితీరతాయి. కాబట్టి, ఏ మదుపరీ స్టాక్‌ మార్కెట్‌ను విస్మరించకూడదు, దలాల్‌స్ట్రీట్‌ నేలచూపులు చూస్తున్నప్పుడు కూడా’

‘కొలెస్ట్రాల్‌లో మంచి కొలెస్ట్రాల్‌, చెడు కొలెస్ట్రాల్‌ ఉన్నట్టే.. అప్పుల్లోనూ మంచి అప్పూ, చెడ్డ అప్పూ ఉంటాయి.  అప్పు అనేది ఓ వంతెన లాంటిది. ఒకవైపు సంపద ఉంటుంది, మరోవైపు దారిద్య్రం ఉంటుంది. ఆ వంతెన మీదుగా ఎటువైపు అయినా వెళ్లవచ్చు. అప్పుతో బాగుపడినవాళ్లు ఎంత మందో, చెడిపోయినవాళ్లూ అంతేమంది.

‘శాంతి నెలకొన్న సమయంలోనే ఆయుధాల్ని కొనుగోలు చేసి   పెట్టుకుంటాడు యోధుడు. ఆర్థిక సూత్రాలకూ దీన్ని అన్వయించుకోవచ్చు. ఒంట్లో సత్తువ ఉన్నప్పుడే రిటైర్‌మెంట్‌ ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలి. తొలి జీతం నుంచే పదవీవిరమణకు దాచిపెట్టుకోవాలి’

‘అప్పుచేసి ఖర్చు పెట్టడం అన్నది సప్తమహా వ్యసనాల కంటే కూడా ప్రమాదకరమైంది. మన జీవితంలో ఆర్థిక సంక్షోభానికి అదో సంకేతం. చాలామంది తాము సంపాదించని డబ్బుతో (అప్పుచేసిన సొమ్ము), తమకు అవసరం లేని వస్తువుల్ని (విలాసాలు) కొని, తమకు పెద్దగా ఇష్టంలేని వ్యక్తుల్ని (అసూయపరుల్ని) ఇంప్రెస్‌ చేయడానికి ప్రయత్నిస్తారు. ఆ జాబితాలో మీరూ ఉంటే మాత్రం... తక్షణం జాగ్రత్తపడండి’.

అసలు సిసలు ‘ఆర్థిక విజేత’ పేరు  ప్రపంచ కుబేరుల జాబితాలో ఉండకపోవచ్చు, అతడికి బంగళాలో, కార్లో లేకపోవచ్చు. ఊరు చివర పూరి గుడిసెలో నివసిస్తూ ఉండవచ్చు. నా దృష్టిలో.. తన అవసరాలకు మించి ఒక్క రూపాయి అదనంగా ఉన్న ఎవరైనా ఆర్థిక విజేతలే! కోట్లకు కోట్లు మూలుగుతున్నా.. తన పిల్లలకూ, వాళ్ల పిల్లలకూ సరిపోదేమో అని బాధపడుతూ కూర్చునేవాడు అసలైన దరిద్రుడు’

‘డబ్బుకు ఆత్మాభిమానం ఎక్కువ. మనల్ని గౌరవించేవాళ్లనే తానూ గౌరవిస్తుంది.తనను ప్రేమించేవాళ్లనేతనూ ప్రేమిస్తుంది. తనను ఖరు ్చపెట్టాలనుకునే వాళ్ల నుంచి సాధ్యమైనంతదూరంగా ఉంటుంది. కాబట్టే, ఏ విశ్వసంపన్నుడూ తనకు షాపింగ్‌ అంటే ఇష్టమని చెప్పడు’

‘ఖర్చు కలుపు మొక్క లాంటిది. పొదుపు విత్తనం లాంటిది. కలుపు పంటను నాశనం చేస్తుంది. ఏదో ఓ దశలో విత్తనాన్నీ మింగేస్తుంది. కాబట్టి, జీవితం అనే పొలంలో తరచూ కలుపు మొక్కల్ని ఏరేయాలి. వీలైనన్ని  విత్తనాలు నాటాలి’


logo