ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Aug 01, 2020 , 20:27:22

‘నిషా’.. నటాషా!

‘నిషా’.. నటాషా!

లాక్‌డౌన్‌ మొదలైనప్పటి నుంచీ థియేటర్లు బంద్‌. దీంతో, ఓటీటీలోనే సినిమాలు విడుదల అవుతున్నాయి. అలా ‘ఆహా’లో వచ్చిన సినిమా.. జిప్సీ. తమిళ డబ్బింగ్‌ అయినా.. తెలుగు ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఆ సినిమాతో పాటు హీరోయిన్‌ కూడా! ఆ నిషాకండ్ల సుందరే నటాషా సింగ్‌.  త్వరలోనే తెలుగు తెరపైనా మెరిసిపోనున్నది నటాషా! 

మిస్‌ హిమాచల్‌ అయ్యాక.. 

 • మిస్‌ యూనివర్సల్‌ పీస్‌ అండ్‌ హ్యుమానిటీ విన్నర్‌గా ప్రఖ్యాత ట్రెయినర్‌ రుహానీ సింగ్‌ దగ్గర వర్కవుట్‌ చిట్కాలు నేర్చుకున్నది. ఢిల్లీలో జరిగిన ఎఫ్‌బీబీ ఫెమినా మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొన్నది. అందులో ఫస్ట్‌ రన్నరప్‌గా నిలిచింది. 
 • కల్యాణ్‌ జువెలర్స్‌ యాడ్‌లో నాగార్జునతో ఆడిపాడిందీ అమ్మడు. ప్రతి సంవత్సరం జాతీయ అవార్డులు వచ్చిన వివిధ భాషల చిత్రాలను తప్పకుండా చూస్తుందట.
 • రాజ్‌తరుణ్‌ తరువాతి సినిమాలో నటాషా సింగ్‌ హీరోయిన్‌గా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. సోషల్‌మీడియా ద్వారా నటాషా కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. 
  • నటాషా వెజిటేరియన్‌. కాకపోతే పాల పదార్థాలూముట్టదట. అంతేకాదు.. ఎలాంటి డైట్‌ ఫాలోకానని అంటున్నది. రాజస్థాన్‌లో షూటింగ్‌ అంటే భయపడిపోతుంది, మామూలు ఎండలా? తనకు ఎడారి ప్రాంతాలు అయిష్టమని చెబుతున్నది. 
  •  మగవాళ్లు.. ఆడవాళ్లతో అబద్ధాలు చెబితే నచ్చదంటున్నది. నిజాయతీ ఉన్న మనుషుల్నే గౌరవిస్తానని స్థిరంగా చెబుతున్నది.
  • సినిమాల్లోకి రాకపోయి ఉంటే, సివిల్‌ ఇంజినీర్‌గా పెద్దపెద్ద బిల్డింగ్స్‌ కట్టేదట. లేదంటే పెయింటర్‌గా మారిపోయి.. క్యాన్వాస్‌ మీద అద్భుతాలు చిత్రించేదట.  
  • నటాషా అందగత్తెలకే అందగత్తె! ‘మిస్‌ హిమాచల్‌' కిరీటాన్ని సొంతం చేసుకుంది. ఆ సమయంలోనే ‘నేను ప్రపంచంలో.. టాప్‌లో ఉన్నట్టు భావిస్తున్నా’ అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. తను పుట్టిందీ పెరిగిందీ హిమాచల్‌ప్రదేశ్‌లో. అందుకేనేమో, నిత్యం ఆపిల్‌లా తాజా తాజాగా కనిపిస్తుంది. 
  • ప్రయాణాలు ఇష్టం. డ్యాన్స్‌ అంటే ప్రాణం. పంజరంలో చిలుకలా ఒక దగ్గరే ఉండమంటే అస్సలు ఉండలేదట. అమితాబ్‌బచ్చన్‌, కమల్‌హాసన్‌, ధనుష్‌, నయనతార, కంగనా, ఆలియాభట్‌ల నటనను అభిమానిస్తుంది. 


logo