బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 02:48:12

పురానా షెహర్‌.. నయా ఖాయిష్‌!

పురానా షెహర్‌.. నయా ఖాయిష్‌!

మందీ, ఖప్సాలు యెమెన్‌ దేశ వంటకాలు. మన దగ్గర చేసే హలీం తరహాలోనే యెమెన్‌లో వీటిని చేస్తారు. యెమెన్‌ నుంచి సౌదీ, దుబాయ్‌, ఇరాక్‌, ఇరాన్‌, సిరియా, లిబియా, టర్కీ దేశాలకు విస్తరించిన ఈ వంటకాలు అక్కడ ఎంతో ప్రాచుర్యం పొందాయి. గల్ఫ్‌ దేశాలకు వెళ్ళే మనవాళ్లు అక్కడి రుచులకు అలవాటు పడ్డారు. వాటి తయారీ విధానాన్ని తెలుసుకుని మన దగ్గర వాటి గురించి బాగా చెప్పుకోవడం.. వాటిని ఇక్కాడా ప్రయత్నిస్తుండటంతో మందీ, ఖప్సాలకు మరింత ఆదరణ పెరుగుతున్నది. వీఐపీలు, సినీనటులు సైతం వీటిపై ఆసక్తి కనబరుస్తుండటం విశేషం. ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో దిగే ప్రముఖులు సైతం ఈ వంటకాన్ని ఇష్టపడుతున్నారు. దీంతో గల్ఫ్‌ నుంచి దిగుమతి చేసుకున్న  హలీమ్‌ మాదిరిగానే ఇప్పుడు మందీ, ఖప్సాలపై  హైదరాబాదీలు అభిమానం పెంచుకుంటున్నారు. వీటిని స్పెషల్‌గా అందించే హోటళ్లు శని, ఆదివారాలు, సెలవు రోజులు రద్దీతో కిటకిటలాడుతుంటాయి. బిర్యానీలో మసాలాలు అధికం. మాంసం ముక్కలు చిన్న చిన్నగా ఉంటాయి. అదే మందీ, ఖప్సాలలో మసాలాలు తక్కువ. దీనిని ఉడికించిన మాంసం నీటితో తయారు చేస్తారు. నూనె లేకుండా నిప్పుపై వేయించిన పెద్ద సైజు మాంసం ముక్కలు తింటుంటే  మహారుచిగా అనిపిస్తాయి. బిర్యానీతో పోల్చుకుంటే తక్కువ ఆయిలీ ఫుడ్‌ ఇది. దీనిలో శరీరానికి శక్తినిచ్చే ప్రొటీన్లు అధికం. కాకపోతే, కొవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా.. చాలా రెస్టరెంట్లు పార్సిల్‌ సర్వీసులకే పరిమితం అవుతున్నాయి. 


logo