శనివారం 31 అక్టోబర్ 2020
Sunday - Jul 26, 2020 , 01:59:34

పిల్లల కోసం సర్చ్‌ ఇంజిన్‌

పిల్లల కోసం సర్చ్‌ ఇంజిన్‌

ఇంటర్‌నెట్‌లో ఏది వెతకాలన్నా గూగుల్‌ చేయడం సాధారణం. పిల్లలు కూడా అంతర్జాలాన్ని విరివిగా వాడే రోజులు ఇవి. తరచూ తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం. అయితే మామూలు వెబ్‌బ్రౌజర్లలో అనవసర ప్రకటనలు పిల్లల దృష్టిని మారుస్తాయి. ఇలాంటి ఇబ్బంది లేకుండా పిల్లల కోసమే ప్రత్యేక వెబ్‌ బ్రౌజర్‌ ఉంది. అదే www.kidy.co. దీని ద్వారా  పిల్లలు కావాల్సిన సమాచారాన్ని వెతుక్కోవచ్చు. ఇతర ప్రకటనలు, సందేశాల గొడవ ఉండదు. పిల్లలు వాడే కంప్యూటర్‌లో, ఫోన్లలో ఇతర సర్చ్‌ ఇంజిన్ల కన్నా .. కిడ్‌.కో ను వాడటం మేలు. . ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్‌తో పనిచేసే కిడీ, పిల్లలకు సంబంధించిన అంశాలు, ఆటలు, సృజనాత్మకతను పెంచే కంటెంట్‌ను మాత్రమే అందుబాటులో ఉంచుతుంది. పిల్లలపై దుష్ప్రభావం చూపే ఎలాంటి సమాచారం కూడా ఇందులో కనిపించదు.