బుధవారం 28 అక్టోబర్ 2020
Sunday - Jul 25, 2020 , 22:30:20

నో సెల్ఫీస్‌ ప్లీజ్‌!

నో సెల్ఫీస్‌ ప్లీజ్‌!

కొందరు గ్లామర్‌ రోల్స్‌ కావాలనుకొంటారు. కొందరు సంప్రదాయంగా కనిపించాలనుకొంటారు. కానీ ఈ అమ్మాయి మాత్రం, తాను చేసిన క్యారెక్టర్‌ గుర్తుండిపోవాలనుకుంటుంది. అందుకే ఏరికోరి మరీ సినిమాలు చేస్తున్నది. చేసిన సినిమాలు తక్కువే అయినా, గుర్తుండిపోయే పాత్రలే చేసింది.. రోషిణి.

  • మైసూర్‌లో జన్మించింది ఈ కన్నడ కస్తూరి. మొదటిసారి కెమెరా ఫేస్‌ చేసినప్పుడు చాలా భయపడిందట. తను ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌'తో తెలుగు తెరకు పరిచయం అయింది. ‘నటుడు సప్తగిరి ఒక ఫన్‌ ప్యాకేజీల ఉంటారు. స్క్రీన్‌ మీదే కాదు.. బయటా’ అని పొగిడేస్తుంది. 
  •  జయచామరాజేంద్ర కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసింది. ఇంజినీరింగ్‌ చదువుతూనే మోడలింగ్‌లోకి అడుగు పెట్టింది. పీయూసీ సమయంలో ర్యాంప్‌వాక్‌ చేసిన అనుభవం ఉంది. ‘మిస్‌ కాలేజ్‌' టైటిల్‌ని గెలుచుకున్నది. రోషిణి ఫెమినా మిస్‌ ఇండియా సౌత్‌ ఫైనలిస్ట్‌. ‘ఫ్యాషనబుల్‌ మిస్‌ పాపులర్‌' అనే సబ్‌టైటిల్‌ని గెలుచుకున్నది. 
   • సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా షూటింగ్‌ అప్పుడు పవన్‌కల్యాణ్‌ని కలిసింది. ఆటోగ్రాఫ్‌ కూడా తీసుకున్నది. ‘అదొక ఫ్యాన్‌ మూమెంట్‌' అంటున్నది. పవన్‌ కల్యాణ్‌ని కలిసిన రోజు.. తనే కాదు.. తన టీమ్‌లో ఎవరూ డిన్నర్‌ చేయలేదట. ఆనందంతోనే కడుపు నిండిపోవడం అంటే ఇదే కావచ్చు. 
  • ఒక నెలపాటు, ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటూ.. సోషల్‌ డిటాక్స్‌ని ట్రై చేసిందట. ఆ సమయంలో ఫోన్‌కాల్స్‌ మాత్రమే అటెండ్‌ చేసిందట. తనకు కాస్త బద్ధ్దకం ఎక్కువని ఒప్పుకుంటున్నదీ భామ. కొన్ని విషయాలు ఇట్టే మరచిపోతానంటున్నది. 
 • అన్న ప్రజ్వల్‌ భరత్‌ ఫ్లోరిడాలో మాస్టర్స్‌ పూర్తి చేశాడు. తండ్రి బిజినెస్‌మాన్‌. బిర్యానీ అంటే ఇష్టం. రోజుకు మూడుస్లారు పెట్టినా తింటానంటుంది. కానీ డైట్‌ వల్ల ఆ సాహసం చేయలేకపోయింది. చైనీస్‌ ఫుడ్‌ను చూస్తే నోరూరుతుందట.  
 • టైమ్‌ దొరికితే అమ్మతో ఆన్‌లైన్‌లో రమ్మీ, సుడోకు ఆడుతుంది. 
 • కన్నడంలో మూడు సినిమాల్లో, తమిళంలో రెండు సినిమాల్లో చేసింది రోషిణి ప్రకాశ్‌. లాంగ్‌డ్రైవ్‌ అంటే ఇష్టం, ట్రావెలింగ్‌ అంటే ప్రాణం. కుటుంబంతో సమయం గడుపడం అంటే ఇష్టమంటున్నది.
 • సెల్ఫీలు తీసుకోవడం తనకు పెద్దగా నచ్చదని అంటున్నది రోషిణి. 


logo