గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 22:11:51

అమ్మ జ్ఞాపకం.. సర్వాయిపేట!

అమ్మ జ్ఞాపకం.. సర్వాయిపేట!

‘కొడితే గోల్కొండ కోటనే కొట్టాలే.. నెల్లూరు.. బందరు బస్తీలనే కొట్టాలే’ అంటూ తెలంగాణ బహుజన పోరాట స్ఫూర్తిని చాటిన సర్దార్‌ సర్వాయి పాపన్న ఏలిన ఊరు సర్వాయిపేట. మొఘల్‌ రాజులను ఓడించి గోల్కొండనేలిన ధీరుడు సర్వాయి పాపన్న ‘సర్వాయిపేట’ గ్రామాన్ని నిర్మించాడు. కరీంనగర్‌ జిల్లా సైదాపూర్‌ మండలంలోని పెర్కపల్లి పరిధిలో ఈ గ్రామం ఉంది. నాటి కోట.. అతిపెద్ద ముఖద్వారం.. భారీ చేదబావి.. సర్వన్న చెరువు ఇప్పటికీ ఉన్నాయి. గోల్కొండ కోటను జయించాలనే లక్ష్యంతో రాజ్యవిస్తరణకు పూనుకున్న పాపన్న, అందుకోసం చుట్టూ గుట్టలున్న గ్రామాన్ని ఎంచుకున్నాడు. తర్వాత ఆ గ్రామానికి తన తల్లి సర్వమ్మ పేరుమీద సర్వాయిపేటగా నామకరణం చేశాడు. కోటలు.. బురుజులు కట్టించి, చెరువులు తవ్వించాడు. అనుకున్నట్లే మొఘల్‌ సైనికులపై సుమారు 12వేల మంది సైనికులతో వీరోచితంగా పోరాడి గోల్కొండను కైవసం చేసుకున్నాడు. సుమారు 20 యేండ్లు  పాలన సాగించినట్లు చరిత్ర చెబుతున్నది. కాగా ఓ రోజు మొఘలులు, స్థానిక నయవంచకులతో కలిసి పాపన్న సామ్రాజ్యంపై దాడికి దిగారు. ఈ దాడిలో పాపన్న సైన్యం చాలావరకు నష్టపోయింది. శత్రువు చేతిలో చావడం తన స్వభావానికి విరుద్ధమని భావించిన పాపన్న సర్వాయిపేటలో ఆత్మత్యాగం చేసుకున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. logo