గురువారం 29 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 22:07:58

ఊరంతా ఒక్కటయ్యే.. ఊర పండుగ!

ఊరంతా ఒక్కటయ్యే.. ఊర పండుగ!

ఊరంతా కలిసి పండగ చేసుకునే రోజులు పోయాయి. దానికి నిజామాబాద్‌ మాత్రం మినహాయింపు. వారసత్వంగా వస్తున్న ఒక గ్రామీణ ఆచారాన్ని పాటిస్తూ ప్రతీ సంవత్సరం ఊర పండుగ నిర్వహిస్తున్నారు.

ఎందుకు చేస్తారు? : పాడిపంటలు సమృద్ధిగా ఉండాలని.. పశువులు ఆరోగ్యంగా ఉండాలనీ.. వింత వ్యాధుల బారిన ప్రజలు పడొద్దని ఈ పండుగ జరుపుకొంటారు. ఆషాఢమాసం మొదలుకాగానే ప్రతీ ఆదివారం ఒక వీధి నుంచి బోనం తీసి.. చివరి ఆదివారం ఊరపండుగను నిర్వహిస్తారు. 

ఏమేం చేస్తారు?: 

వారం రోజుల ముందే మామిడి దుంపలతో వడ్రంగులు దేవతల రూపాలను చెక్కుతారు. శనివారం అర్ధరాత్రి సిర్నాపల్లి గడి నుంచి ఎవరూ చూడనప్పుడు కొత్త గంపలో ఎత్తుకొని ఖిల్లాకు తరలిస్తారు. గంపను ఎత్తుకున్నవారి ముందు ఉండే వ్యక్తిని దేవతుడిగా పిలుస్తారు. ఏ శక్తులూ అడ్డురావద్దని విగ్రహాలు మోస్తున్న వ్యక్తికి.. దేవతుడికి ముల్లుకట్టెలతో రక్షణ వలయం ఏర్పరచి ఖిల్లా నుంచి మత్తడి పోచమ్మ వరకూ ఊరేగిస్తారు. పొలిమేరల వరకు తీసుకెళ్లి అందరూ మేకలను బలిస్తారు. తర్వాత దేవతలకు నైవేద్యం ఇచ్చి పండుగను పరిసమాప్తం చేస్తారు.