ఆదివారం 25 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 21:49:37

శావణ వేళ.. తీపి వేడుక!

శావణ వేళ.. తీపి వేడుక!

స్వీట్‌ కోకోనట్‌ రైస్‌ 

కావాల్సినవి : 

బియ్యం : ఒక కప్పు 

కొబ్బరి పాలు : 2 కప్పులు 

కొబ్బరి తురుము : ఒక కప్పు 

కెవ్రా వాటర్‌ : పావు కప్పు 

చక్కెర : ఒక కప్పు 

జీడిపప్పులు : 8

నెయ్యి : ఒక టీస్పూన్‌

కిస్‌మిస్‌ : 10

తయారీ : 

బియ్యాన్ని కడిగి పావుగంట నానబెట్టాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని స్టౌ మీద పెట్టాలి. దాంట్లో నానబెట్టిన బియ్యం, కొబ్బరి పాలు, కెవ్రా వాటర్‌ పోసి దాదాపు సగానికి పైగా అన్నం అయ్యేలా వండి పెట్టుకోవాలి. దీంట్లోనే చక్కెర వేసి మరో ఐదు నిమిషాలు కలిపి దించేయాలి. ఈలోపు కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పులు, కిస్‌మిస్‌లు వేసి వేయించాలి. వీటిని కొబ్బరి అన్నంలో వేసి కలుపాలి. చివరగా కొబ్బరితురుముతో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవాలి. తియ్యని కోకోనట్‌ రైస్‌ రెడీ!

స్వీట్‌ డంప్లింగ్‌ 

కావాల్సినవి : 

మైదా : ఒక కప్పు 

యాలకుల పొడి : ఒక టీస్పూన్‌ 

బేకింగ్‌ పౌడర్‌ : అర టీస్పూన్‌ 

బేకింగ్‌ సోడా : చిటికెడు 

నువ్వులు : రెండు టీస్పూన్స్‌ 

బెల్లం : అర కప్పు 

చక్కెర పొడి : ఒక టీస్పూన్‌ 

నూనె : తగినంత 

తయారీ :  

నువ్వులను కొద్దిగా వేయించి పెట్టుకోవాలి. బెల్లంలో కొన్ని నీళ్లు పోసి కరిగేలా చేసుకోవాలి. ఒక గిన్నెలో మైదా, యాలకుల పొడి, నువ్వులు, బేకింగ్‌ పౌడర్‌, బేకింగ్‌ సోడా వేసి బాగా కలుపాలి. ఇందులో బెల్లం నీళ్లు పోసి మైసూర్‌ బజ్జీ మిశ్రమంలా కలుపుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. చేతితో మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోని వేయాలి. వీటిని గోల్డెన్‌ కలర్‌ వచ్చేవరకు వేయించాలి. ఇలా అన్ని చేసుకొని పై నుంచి చక్కెర పొడితో డస్టింగ్‌ చేసుకోవాలి. రుచికరమైన డంప్లింగ్‌ మీ ముందుంటాయి. 


logo