మంగళవారం 27 అక్టోబర్ 2020
Sunday - Jul 18, 2020 , 20:27:16

పచ్చిపులుసు.. పరమౌషధం

పచ్చిపులుసు.. పరమౌషధం

 • పచ్చి పులుసు చేయడం ఓ కళ. చింతపండు నానబెట్టి రసం తీసి పెట్టుకోవాలి. ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, ఉప్పు వేసి కలుపాలి. కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి.. వేయించి పోపు పెట్టాలి. అంతే,టేస్టీ పచ్చిపులుసు రెడీ!
 • అప్పట్లో, ఎండాకాలంలో పచ్చి పులుసును ఎక్కువగా చేసుకునేవాళ్లు. ఇప్పుడు సర్వకాలాల్లోనూ లాగించేస్తున్నారు. ఒంటికి చలువ చేయడానికి కూడా పచ్చిపులుసును వడ్డిస్తారు. ఒకప్పుడు పోపులూ అవీ లేకుండా పచ్చిమిర్చీ, ఉల్లిపాయలూ బొగ్గులో కాల్చి, అందులో చింతపండు కాస్త గట్టిగా పిసికి పచ్చిపులును చేసేవారు. కొన్ని ప్రాంతాల్లో బెల్లం, ఇంగువ వేసుకొంటారు. 
 • ఎవరైనా చనిపోయినప్పుడు ఆ ఇంటివాళ్లు ఏమీ చేసుకోరు. కాబట్టి, బంధుమిత్రులువాళ్లకోసం ముద్దపప్పు వేసి, పచ్చిపులుసు చేయడం ఆనవాయితీ. కొందరు చింతపండుకు బదులుగా మామిడికాయను ఉడికించి, ఆ గుజ్జు తీసి కూడా మామిడికాయ రసం అనిచేస్తుంటారు. రెండింటి రెసిపీ ఒకటే.
 • చింతపండులో ఫైబర్‌, మినరల్స్‌, విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని ఫైబర్‌ అజీర్తి సమస్యలను సమర్థంగా నివారిస్తుంది. డయేరియాని తగ్గిస్తుంది. చింతపండులో టార్టారిక్‌ యాసిడ్‌ ఉంటుంది. ఇది హానికారక ఫ్రీరాడికల్స్‌ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. క్యాన్సర్‌ రిస్క్‌ని కూడా తగ్గిస్తుంది. 
 • రక్తపోటును, హృదయ స్పందనను కంట్రోల్‌ చేస్తుంది చింతపండు. ఇందులోని విటమిన్‌-సి రోగనిరోధకతను పెంచుతుంది. దగ్గు, జలుబు నుంచి రక్షణ పొందవచ్చు. చక్కెర స్థాయిని తగ్గించడంలో, కాలేయాన్ని రక్షించడంలో చింతపండు బాగా ఉపయోగపడుతుంది. 
 • పచ్చిమిర్చిలో క్యాలరీలు శూన్యం. ఇందులో ఉండే రసాయనాలు జీవక్రియలను వేగవంతం చేస్తాయి. ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయదంటారు. కాళ్లకూ కీళ్లకూ మంచి మందులా పనిచేస్తుంది. ఉల్లిపాయలో మినరల్స్‌ కూడా అధికమే. 
  • ఆవాల్లో మెగ్నీషియం, క్యాల్షియం, మాంగనీస్‌, జింక్‌, ఒమెగా త్రీ ఫ్యాటీయాసిడ్స్‌, ప్రొటీన్లు, పీచు పదార్థాలు ఉంటాయి. ఆవాలు కొలెస్ట్రాల్‌ స్థాయిని అదుపులో ఉంచుతాయి. రక్తప్రసరణను వేగవంతం చేస్తాయి. జీలకర్రలో ఉండే థెమోల్‌, ఇతరత్రా నూనెలు ఆహారం జీర్ణమయ్యేలా చేస్తాయి. 
  • శ్వాస సమస్యల పరిష్కారంలో, వాపు నివారణలో పచ్చిపులుసులోని జీలకర్ర మెడిసిన్‌లా పనిచేస్తుంది. కంటి, పంటి సమస్యలకు 
  • చక్కని ఔషధం కూడా. ఇక, కరివేపాకు శరీరంలోని చెడు కొవ్వులను కరిగిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్‌ మూత్ర సంబంధసమస్యలను దూరం చేస్తుంది. కరివేపాకులోని యాంటీ హైపర్‌ గ్లిసమిక్స్‌, రక్తనాళాల్లోని గ్లూకోజ్‌ని కంట్రోల్‌ చేస్తాయి. 
  • కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అంతేకాదు..ప్రొటీన్స్‌, కాల్షియం, పాస్ఫరస్‌, ఆక్సాలిక్‌ యాసిడ్స్‌, పొటాషియం, ఐరన్‌, సోడియం మొదలైనవి ఉంటాయి. కడుపునొప్పి, ఉబ్బసం, ఎలర్జీలాంటి బాధలకు; నోటిపూత, నోటి దుర్వాసన, దంతాలు పుచ్చిపోవడం వంటి ఇబ్బందులకు కొత్తిమీర మంచి ఔషధం. 


logo